BREAKING: భట్టి అధికారిక నివాసంగా ప్రజా భవన్

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిప్యూటీ సీఎం అధికారిక నివాసంగా ప్రజా భవన్ ను కేటాయించింది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర సర్కార్.

BREAKING: భట్టి అధికారిక నివాసంగా ప్రజా భవన్
New Update

Praja Bhavan Is Now Deputy CM Residence: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిప్యూటీ సీఎం అధికారిక నివాసంగా ప్రజా భవన్ ను కేటాయించింది. దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఇక నుంచి ప్రజా భవన్ లో నివాసం ఉండనున్నారు. రేపు మధ్యాహ్నం ప్రజా భవన్లోకి కుటుంబ సమేతంగా అడుగుపెట్టనున్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క.

ALSO READ: ‘లోక్ సభలో వదిలిన పొగ..’ స్పీకర్ ఓం బిర్లా ఏం అన్నారంటే..?

కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ప్రగతి భవన్‌ను ప్రజాభవన్‌గా ప్రభుత్వం మార్చింది. గతంలో భవన్ ముందు ఉన్న బారికేడ్లు, ఐరన్‌ గ్రిల్స్‌ను తొలిగించాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశాల మేరకు అధికారులు వాటిని తొలిగించారు. ప్రగతి భవన్‌లోకి ప్రజలకు అనుమతించిన రేవంత్‌ సర్కార్‌. ప్రగతి భవన్‌లో ప్రజాదర్బార్‌ ను సీఎం రేవంత్‌ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

ప్రజా భవన్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా ప్రకటించడంతో సీఎం రేవంత్ నివాసం ఎక్కడ అనేది చర్చ జరుగుతోంది. అయితే, ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయంగా  మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రాన్ని (ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ) భవనాన్ని వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే ఆయన ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ భవనాన్ని సందర్శించినట్లు సమాచారం. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల్లో గెలవడంతో ముఖ్యమంత్రిగా అధికార బాధ్యతలు చేపట్టిన రేవంత్‌.. తన క్యాంపు కార్యాలయంగా మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌ను వినియోగించడానికి ఇష్టపడటం లేదని తెలిసింది. అందుకే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా జూబ్లీహిల్స్‌లోని సొంత ఇంట్లోనే రేవంత్‌ నివాసముంటున్నారు.

ALSO READ: కొత్త ఏడాది సెలవులు ప్రకటించిన జగన్ సర్కార్.. సంక్రాంతి సెలవుల డేట్స్ ఇవే!

publive-image

#bhatti-vikramarka #breaking-news #praja-bhavan
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe