PMVY: విశ్వకర్మ యోజనకు అప్లై చేసుకునేవారికి అలెర్ట్.. ఇవి తప్పనిసరి!

PM విశ్వకర్మ యోజన పథకానికి అప్లై చేసేవారికి ఆధార్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్, కుల, నివాస ధృవీకరణ పత్రం, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, యాక్టివ్ మొబైల్ నంబర్‌, మీ బ్యాంక్ ఖాతా సమాచారాన్ని కచ్చితంగా దగ్గర పెట్టుకోవాలి. వీటిలో ఏది లేకున్నా అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది.

New Update
PMVY: విశ్వకర్మ యోజనకు అప్లై చేసుకునేవారికి అలెర్ట్.. ఇవి తప్పనిసరి!

Pradhan Mantri Vishwa Karma Yojana: రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రెండూ వాటి స్థాయిలలో అనేక ప్రయోజనకరమైన సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయి. అనేక పథకాల ద్వారా అర్హులైన ప్రజలకు ప్రయోజనాలు కల్పిస్తున్నాయి. అలాంటి పథకాల్లో ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన(Pradhan Mantri Vishwa Karma Yojana) ఒకటి. ఈ పథకం కింద అర్హులైన వారికి ఆర్థిక సాయం అందిస్తారు. మీరు కూడా ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేస్తున్నారా? అయితే కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. రిజిస్ట్రేషన్ సమయంలో మీకు అవసరమైన డాక్యుమెంట్ల గురించి తెలుసుకోవాలి. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే అడిగిన పత్రాలను సబ్మిట్ చేయకపోతే మీ దరఖాస్తు నిలిచిపోతుంది. ఆ డాక్యుమెంట్స్‌ ఏంటో మేం మీకు చెప్పబోతున్నాం..!

ఈ డాక్యుమెంట్స్‌ అవసరం:

--> ఆధార్ కార్డ్(Aadhaar Card).
--> అడ్రస్ ప్రూఫ్.
--> కుల ధృవీకరణ పత్రాన్ని కూడా అందించాలి.
--> దరఖాస్తుదారు తన నివాస ధృవీకరణ పత్రాన్ని చూపించాలి.
--> దరఖాస్తు సమయంలో మీరు మీ బ్యాంక్ ఖాతా(Bank Account) సమాచారాన్ని కూడా అందించాలి.
--> మీ పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, యాక్టివ్ మొబైల్ నంబర్‌(Active Mobile Number)ను కూడా అందించాలి.

ఒరిజినల్ కాపీలు అవసరమని గుర్తుంచుకోగలరు:

ప్రయోజనాలేంటి?

--> మీరు పథకంలో చేరినట్లయితే మీకు రోజుకు రూ.500 స్టైఫండ్ ఇస్తారు.
--> టూల్‌కిట్‌ను కొనుగోలు చేయడానికి మీకు రూ. 15,000 ఇస్తారు.
--> రూ.లక్ష రుణం, ఆపై రూ.2 లక్షల అదనపు రుణం.. గ్యారెంటీ లేకుండా, చౌక వడ్డీ రేటుకు ఇస్తారు.

ఇది కూడా చదవండి: మార్గాని భరత్ ప్రచార రథానికి నిప్పు… ఎవరి పని?

Advertisment
Advertisment
తాజా కథనాలు