Salaar Collections Day 3: సలార్‌ కలెక్షన్ల ఊచకోత.. రూ. 400 కోట్లతో బాక్సాఫీస్‌ వద్ద ప్రభాస్‌ ప్రకంపనలు!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో విడుదలైన చిత్రం 'సలార్'. రిలీజైన ఫస్ట్ డే నుంచే రిమార్కబుల్ కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది. విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 400 కోట్ల మార్క్ దాటేసి బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలగొట్టడానికి సిద్ధంగా ఉంది.

Movies:ఓటీటీల్లోనూ దమ్ముదులుపుతున్న సలార్
New Update

Salaar Collections Day 3: కేజీఎఫ్ (KGF) ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా విడుదలైన చిత్రం 'సలార్' (Salaar). డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో రిలీజైన ఈ సినిమా థియేటర్స్ లో అద్భుతంగా రన్ అవుతోంది. విడుదలైన మొదటి రోజు నుంచే తెలుగు రాష్ట్రాలతో పాటు.. ఓవర్ సీస్ లో కూడా సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. రిమార్కబుల్ కలెక్షన్స్ తో మొదలైన సలార్ వసూళ్లు లాభాల బాటలో దూసుకెళ్తున్నాయి.

గత వారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సలార్ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధిస్తుంది. మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 400 కోట్ల మార్క్ దాటేసిన సలార్ వసూళ్ల జోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలగొట్టడానికి సిద్ధంగా ఉంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే 500 కోట్ల మార్కును చేరడానికి దగ్గరగా ఉంది. తాజాగా మేకర్స్ ఇప్పటికే సినిమా 402 కోట్ల వసూళ్లను రాబట్టినట్లు ప్రకటించారు. క్రిస్మస్ సందర్భంగా పబ్లిక్ హాలీడే కావడంతో నాలుగవ రోజు వసూళ్లు పెరిగే అవకాశం ఉంది.

Also Read: శ్రీలీల ఫ్యాన్స్.. గుంటూరు కారంలో ఆ పాట ఉండే ఛాన్స్ కనబడటం లేదు!

ఒక్క ఆదివారం రోజే సలార్ ఇండియాలో 61కోట్ల నెట్ వసూళ్లను రాబట్టినట్లు అంచనాలు సూచిస్తున్నాయి. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సలార్ మూడు రోజుల కలెక్షన్స్ 208 కోట్లకు చేరుకుంది. సలార్ చిత్రం ఇండియాలో 73. 64 శాతం ఆక్యుపెన్సీ సాధించింది. వచ్చే రోజుల్లో కూడా సలార్ జోరు మరింత కొనసాగే అవకాశం ఉంది. ప్రశాంత్ నీల్, ప్రభాస్ (Prabhas) కాంబినేషన్ లో విడుదలైన మొదటి చిత్రం సలార్. ఈ సినిమాలో తమిళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రభాస్ స్నేహితుడిగా ప్రధాన పాత్రలో నటించారు. శ్రుతిహాసన్, జగపతి బాబు, శ్రీయారెడ్డి, ఈశ్వరీ రావు కీలక పాత్రల్లో కనిపించారు.

Also Read: Salaar First Day Collections: దుమ్ములేపిన సలార్ ఫస్ట్ డే కలెక్ట్సన్స్.. ఎన్ని కోట్లో తెలిస్తే షాకవుతారు!

#salaar-third-day-collections #salaar-collections #salaar-movie
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe