Prabhas Salaar: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'సలార్ ' కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు సార్లు వాయిదా పడిన 'సలార్' రిలీజ్ డేట్ మరోసారి వాయిదా పడనుందా.. అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ 'డంకి' సినిమా కూడా అదే తేదీల్లో ఉండడం వల్ల 'సలార్' మేకర్స్ వెనకడుగు వేస్తున్నారని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే డిసెంబర్ 22 న 'సలార్' రిలీజ్ చేస్తున్నట్లుగా మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ మరోసారి ఈ సినిమా వాయిదా పడనున్నట్లు టాక్ నడుస్తోంది.
'సలార్', 'డంకి' సినిమాలు డిసెంబర్ లో క్రిస్మస్ సందర్బంగా బాక్స్ ఆఫీస్ వద్దకు రానున్నాయి. ఇప్పటికే షారుక్ 'పఠాన్', 'జవాన్' సినిమాలతో బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల మోత మోగించాయి. విజయాలతో దూసుకెళ్తున్న షారుక్.. ఇప్పుడు రాబోయే 'డంకి' సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబడుతుందని బాలీవుడ్ వర్గాలు అంచనాకు వచ్చాయి. ప్రభాస్ 'ఆదిపురుష్' 'రాదేశ్యామ్' సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేపోయాయి. ఆ తర్వాత ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబినేషన్ లో వస్తున్న 'సలార్' కోసం ప్రభాస్ ఫ్యాన్స్ భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు.
భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ రెండు సినిమాలు ఒకేసారి విడుదల కావడం సరైంది కాదని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏదైనా తేడా వస్తే సినిమా వసూళ్ల పై భారీ ప్రభావము చూపే అవకాశం ఉందని చెబుతున్నారు. కావున ఈ రెండు సినిమాలు క్లాష్ అవ్వడం మంచిది కాదని సినీ విశ్లేషకుల అభిప్రాయం. గతంలో 'సలార్' సినిమా సెప్టెంబర్ లో విడుదల అని ప్రకటించిన మేకర్స్.. తర్వాత మళ్ళీ డిసెంబర్ కు వాయిదా వేశారు. ఇక ఇప్పుడు మరోసారి ఈ సినిమా వాయిదా పడనున్నట్లు సోషల్ మీడియాలో గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి. దీని పై మేకర్స్ అధికారిక ప్రకటన ఇవ్వాల్సి ఉంది. ఒకవేళ సలార్ మళ్ళీ వాయిదా పడితే.. 2024 జనవరి, లేదా మార్చ్ నెలలో విడుదల అయ్యే అవకాశం ఉంది.
Also Read: Varun Tej – Lavanya: వరుణ్ తేజ్ రెసెప్షన్ లో చిరంజీవి సర్ ప్రైజ్ గిఫ్ట్..!