Salaar 2 : వచ్చే నెల నుంచే 'సలార్ 2' షూటింగ్.. ప్రభాస్ కోసం భారీ సెట్! 'సలార్ 2' షూటింగ్ కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ బయటికొచ్చింది. ఈ మూవీ షూటింగ్ ఆగష్టు 10 నుంచి హైదరాబాద్‌లో ప్రారంభం కానుందని.. దీనికోసం రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్ వేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. సుమారు 15 రోజల పాటూ ప్లాన్ చేసిన ఈ షెడ్యూల్ ఉండనున్నట్లు సమాచారం. By Anil Kumar 04 Jul 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Salaar -2 Shooting Update : పాన్ ఇండియా హీరో ప్రభాస్ – కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన ‘సలార్’ పార్ట్-1 గత ఏడాది విడుదలై భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. హొంబాలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర 700 కోట్ల వసూళ్లు రాబట్టి ప్రభాస్ కి మంచి కమ్ బ్యాక్ ఇచ్చింది. సినిమాలోని యాక్షన్ సీన్స్ ఆడియన్స్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. ‘సలార్’ పార్ట్-1 హిట్ అవ్వడంతో అప్పుడే పార్ట్-2 పై అంచనాలు పెరిగిపోయాయి. సలార్: పార్ట్ 1 – సీజ్ ఫైర్ అంటూ రాగా.. సలార్: పార్ట్ 2-శౌర్యంగ పర్వం అంటూ రాబోతుంది. అయితే పార్ట్ 2 అనౌన్స్ చేశారు కానీ ఇప్పటివరకు అయితే సెట్స్ మీదకి వెళ్లలేదు. ఇక ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా.. ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇక ఎట్టకేలకు ఆ సమయం రానే వచ్చింది. 'సలార్ 2' షూటింగ్ కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ బయటికొచ్చింది. Also Read : ‘కల్కి’ ఖాతాలో మరో రికార్డ్.. అప్పుడే రూ.700 కోట్ల క్లబ్ లో! ఆగస్టు 10 నుంచి... దాని ప్రకారం.. 'సలార్ 2' షూటింగ్ ఆగష్టు 10 నుంచి హైదరాబాద్‌లో ప్రారంభం కానుందని.. దీనికోసం రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్ వేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. సుమారు 15 రోజల పాటూ ప్లాన్ చేసిన ఈ షెడ్యూల్ లో ప్రభాస్ పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. కాగా ఇప్పటికే 20 శాతం ప్రభాస్ లేకుండా వచ్చే సన్నివేశాలను మేకర్స్ పూర్తి చేసినట్లు తెలుస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. #prabhas #salaar-2-shooting మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి