Prabhas Rajasaab: మారుతి రాజాసాబ్‌' కి ఈ చిక్కులేంటో.. రిలీజ్ ఆలస్యమేనా..?

ప్రభాస్- మారుతి కాంబో లో తెరకెక్కుతోన్న రాజాసాబ్ మూవీ ఇప్పటికే 50% షూటింగ్ పూర్తయింది. అయితే ఈ మూవీకి సలార్ 2 షెడ్యూల్స్ ఆటంకంగా మారే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ప్రభాస్ సలార్ 2 కు ప్రాధాన్య‌త‌నిస్తే మాత్రం రాజాసాబ్ రిలీజ్ లేట్ కావచ్చని టాక్.

New Update
Prabhas Rajasaab:  మారుతి రాజాసాబ్‌' కి  ఈ చిక్కులేంటో.. రిలీజ్ ఆలస్యమేనా..?

Prabhas Rajasaab: రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ చిత్రం సలార్ బాక్స్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమా రికార్డు వసూళ్లతో సంచలనం సృష్టించింది. ఇదే ఊపులో సలార్ 2 షూటింగ్ వేగంగా పట్టాలెక్కించేందుకు ఆసక్తిగా ఉన్నారు ప్రశాంత్ నీల్. గతంలో కూడా కేజీఎఫ్ సీక్వెల్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సెట్స్ పైకి తీసుకెళ్లి భారీ వసూళ్లతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించారు. ఇక ఇప్పుడు ఈ విజనరీ డైరెక్టర్ సలార్ సీక్వెల్ పై కూడా ఇదే ఫార్ములాను అప్లై చేయబోతున్నారని సమాచారం. ఇది ఇలా ఉంటే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మారుతి డైరెక్షన్ లో ఓ కామెడీ ఎంటర్ టైనర్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే సంక్రాంతి కానుకగా.. రాజాసాబ్ అంటూ సినిమా టైటిల్ కూడా రివీల్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. కానీ ఈ సినిమా రిలీజ్ మాత్రం ఆలస్యమయ్యే ఛాన్స్ ఉందని నెట్టింట్లో టాక్ వినిపిస్తోంది.

publive-image

Also Read: Anchor Sreemukhi : పింక్‌ డ్రెస్‌లో మత్తెక్కిస్తున్న శ్రీముఖి.. ఫొటోలు చూస్తే ఫ్లాట్‌ అవ్వాల్సిందే

రాజాసాబ్ రిలీజ్ ఆలస్యం

అయితే ఇటీవలే విడుదలైన సలార్ సూపర్ సక్సెస్ కావడంతో వీలైనంత త్వరగా సలార్ 2 రిలీజ్ చేస్తే బజ్ బాగా ఉంటుందని మేకర్స్ అంచనాలు. దీంతో రాజాసాబ్ సినిమాకు సలార్ 2 అడ్డు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఒకవేళ ప్రభాస్ సలార్ 2 ప్రాధాన్యం ఇస్తే మారుతి డైరెక్షన్ లో వస్తున్న రాజాసాబ్ రిలీజ్ ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉందని టాక్. ఇలా కాకుండా సలార్ 2 ప్రీ ప్రొడక్షన్ ఆలస్యం అయితే.. ఈ గ్యాప్ లో మారుతి.. రాజాసాబ్ కు సంబంధించి మిగిలిపోయిన షూటింగ్ పూర్తి చేసే అవకాశం ఉంది. అనుకున్నట్లే రాజాసాబ్ షూటింగ్ కంప్లీట్ అయితే ఈ ఏడాది థియేటర్స్ లో సందడి చేయడం ఖాయమని చెబుతున్నారు.

publive-image

"రాజాసాబ్"

ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. మాస్ యాక్షన్ తో డైనోసర్ లా కనిపించే ప్రభాస్ రాజాసాబ్ లో డార్లింగ్ లా కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్ పంచలో డిఫరెంట్ లుక్ తో కనిపించి సినిమా పై అభిమానుల్లో ఆసక్తిని పెంచేశారు డార్లింగ్.

Also Read: Sai Pallavi: చెల్లి ఎంగేజ్ మెంట్ వేడుకల్లో సాయి పల్లవి.. మాస్ డాన్స్

Advertisment
తాజా కథనాలు