Prabhas New Movie: వార్ నేపథ్యంలో ప్రభాస్ మూవీ.. ఆ దర్శకుడి క్రేజీ ప్రాజెక్ట్.. బడ్జెట్ ఎంతంటే.. 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్ మూవీ డిసెంబర్ లో రాబోతోంది. తాజాగా ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రీ మూవీస్ ఒక భారీ బడ్జెట్ సినిమా నిర్మించబోతోంది. సెకండ్ వరల్డ్ వార్ నేపధ్యంగా ఈ సినిమా ఉంటుందని టాక్. టాలీవుడ్ లో ఈ సినిమాపై ఇప్పటికే బజ్ మొదలైంది.

New Update
Prabhas New Movie: వార్ నేపథ్యంలో ప్రభాస్ మూవీ.. ఆ దర్శకుడి క్రేజీ ప్రాజెక్ట్.. బడ్జెట్ ఎంతంటే.. 

Prabhas New Movie: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా వచ్చి చాలాకాలం అయింది. ఎన్నో అంచనాలతో వచ్చిన ఆదిపురుష్ అందర్నీ నిరాశపరిచింది. పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ మూడు మూవీస్ ప్రస్తుతం సెట్స్ మీద ఉన్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘సలార్‌ పార్ట్‌1 సీజ్‌ ఫైర్‌’ విడుదలకు రెడీ అయిపొయింది. డిసెంబర్ 22 వ తేదీన క్రిస్మస్ కానుకగా ఈ పాన్ వరల్డ్ మూవీ విడుదల కాబోతోందని ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. డిసెంబర్ 1 వ తేదీన సలార్ మూవీ ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్టు కూడా ఎనౌన్స్ చేశారు. అంటే డిసెంబర్ నెలలో ప్రభాస్ హంగామా మామూలుగా ఉండదన్న మాట. ఇదిలా ఉంచితే సలార్ మూవీ సెట్స్ మీద ఉండగానే ప్రభాస్ మూడు సినిమాలు కమిట్ అయిన సంగతి తెలిసిందే. 

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 ఏడి సినిమా(Prabhas New Movie)చేస్తున్నారు. ఇది కాకుండా దర్శకుడు మారుతీ తో మరో సినిమాలోనూ సందడి చేసేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నారు. ఈ రెండు సినిమాలు లైన్ లో ఉండగానే ఇటీవల సందీప్ రెడ్డి వంగా తో స్పిరిట్ మూవీ ఎనౌన్స్ చేశారు. అంటే ఇప్పుడు మూడు సినిమాలు ప్రభాస్ వరుసలో పెట్టినట్టు. అయితే, తాజాగా ఇంకో సినిమా కూడా లైన్ లోకి వస్తున్నట్టు తెలుస్తోంది.

Also Read: క్రికెట్ పండగ అయిపోయింది.. ఇక సినిమాల జాతర.. బీ రెడీ మూవీ లవర్స్!

సంచలన దర్శకుడు హను రాఘవపూడితో కూడా ప్రభాస్ ఒక మూవీ చేయడానికి ఒప్పుకున్నట్లున్యూస్ వస్తోంది. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. మైత్రి అంటేనే భారీ సినిమాలకుక్ కేరాఫ్ ఎడ్రస్ కదా.. ఇప్పుడు ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ లో భారీ స్థాయిలో రెడీ చేయడానికి ప్లాన్  చేస్తున్నారట. సెకెండ్ వరల్డ్ వార్ నేపథ్యంలో లవ్, థ్రిల్, యాక్షన్ మిక్స్ సినిమాగా ఈ సినిమా రూపొందనున్నట్టు చెబుతున్నారు. అత్యంత భారీ వ్యయంతో అంటే దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీ రెడీ అవుతుందని తెలుస్తోంది. మేకర్స్ నుంచి అఫీషియల్ గా ఈ క్రేజీ ప్రాజెక్ట్ వివరాలు వెల్లడి కావాల్సి ఉన్నాయి. త్వరలోనే ఈ బిగ్ ఎనౌన్స్మెంట్ ఉంటుందని టాలీవుడ్ టాక్. 

అంటే ఇప్పుడు సలార్  తరువాత ప్రభాస్ నాలుగు సినిమాలు వరుసలో ఉన్నాయని చెప్పవచ్చు. వరుసగా ఇన్ని సినిమాలు చేతిలో ఉన్న హీరో మన దేశంలో ప్రస్తుతం ప్రభాస్ ఒక్కడే కావడం గమనార్హం. ప్రభాస్ బాక్సాఫీస్ స్టామినాకి ఈ సినిమాలే నిదర్శనం అంటున్నారు టాలీవుడ్ విశ్లేషకులు. 

Watch this interesting Video:

#prabhas #director-hanu-raghavapudi
Advertisment
తాజా కథనాలు