ప్రభాస్ ఫ్యాన్స్ బీభత్సం

ప్రభాస్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కిన చిత్రం ఆదిపురుష్.. ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం విడుదలైంది. ఈ సినిమా కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అభిమానులు థియేటర్ల వద్ద హంగామా చేస్తున్నారు. ముఖ్యంగా బెనిఫిట్ షోల కోసం తెల్లవారుజామునే థియేటర్లకు వచ్చిన అభిమానులు.. రాముడికి పాలాభిషేకాలు చేశారు.

New Update
ప్రభాస్ ఫ్యాన్స్ బీభత్సం

prabhas-movie-review-fans-attacked-the-youth-at-the-theatre

ఆదిపురుష్ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. అభిమానులు థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. ముఖ్యంగా బెనిఫిట్ షోల కోసం తెల్లవారుజామునే థియేటర్లకు వచ్చిన ప్రభాస్ కటౌట్లకు పాలాభిషేకాలు చేశారు. ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌లోని ఐమాక్స్ వద్ద ప్రభాస్ అభిమానులు బీభత్సం సృష్టించారు. ఓ అభిమాని మూవీ బాలేదని చెప్పినందుకు ఆగ్రహం వ్యక్తం చేసిన ఫ్యాన్స్ అతడ్ని చితక్కొట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. జెన్యూన్ ఓపీనియన్ చెబితే కొట్టడం ఏంటని కొందరు సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. మరి కొందరు ప్రభాస్ ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.

ఇక మూవీ విషయానికొస్తే... భారతీయ జీవన సౌందర్యంలో మమేకమైన అద్భుత కావ్యం. వాల్మీకి విరచిత ఇతిహాసగాథ ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయం. అజరామరమైన అలాంటి కావ్యానికి ఎంతో మంది దర్శకులు దృశ్యరూపం ఇచ్చి వెండితెరపై ఆవిష్కరించారు. ఇప్పుడు నేటి తరానికి ఆ రామాయణం గొప్పతనాన్ని చెప్పే బాధ్యతను దర్శకుడు ఓం రౌత్‌ భుజానికెత్తుకున్నారు. ప్రభాస్‌ రాముడిగా ఆయన తెరకెక్కించిన చిత్రం ఆదిపురుష్‌.

సాంకేతిక హంగులతో రూపొందిన ఈ సినిమా ఎలా ఉంది? రామాయణాన్ని ఓం రౌత్‌ ఎలా ఆవిష్కరించారు? వాల్మీకి ర‌చించిన ఇతిహాసం రామాయ‌ణంలోని కొన్ని ప్ర‌ధాన ఘ‌ట్టాల ఆధారంగా రూపొందిన చిత్ర‌మిది. మ‌ర్యాద పురుషోత్త‌ముడైన రాఘ‌వ (ప్ర‌భాస్‌) వ‌న‌వాసం స్వీక‌రించ‌డం నుంచి క‌థ ప్రారంభం అవుతుంది. త‌న అర్ధాంగి, అపురూప సౌంద‌ర్య‌వ‌తి అయిన జాన‌కి (కృతిస‌న‌న్‌), సోద‌రుడు శేషు (స‌న్నీసింగ్‌)తో క‌లిసి స‌త్యం, ధ‌ర్మ‌మే త‌న ఆయుధంగా వ‌న‌వాసం గ‌డుపుతుంటాడు. శ‌త్రు దుర్భేద్యమైన లంకని ఏలుతున్న లంకేశ్ (సైఫ్ అలీఖాన్‌) త‌న సోద‌రి శూర్ప‌ణ‌ఖ చెప్పిన మాటలు విని జాన‌కిని అప‌హ‌రిస్తాడు. అశోక‌వ‌నంలో బంధిస్తాడు. త‌న జాన‌కిని తిరిగి తీసుకొచ్చేందుకు రాఘ‌వ ఏం చేశాడు? త‌ర‌త‌రాలు చెప్పుకొనేలా సాగిన ఆ పోరాటంలో చెడుపై మంచి ఎలా గెలిచింద‌న్న‌ది మిగ‌తా క‌థ‌.

ఎలా ఉందంటే: కొత్త‌త‌రం ప్రేక్ష‌కుల సినీ వీక్ష‌ణ‌లో చాలా మార్పులొచ్చాయి. క‌ట్టిప‌డేసేలా విజువ‌ల్స్‌, అబ్బుర ప‌రిచేలా గ్రాఫిక్స్ హంగులు... సూప‌ర్ శ‌క్తుల‌తో కూడిన పాత్రల మేళ‌వింపునే ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డుతున్నారు. ఆ అభిరుచుల్నే ప్రామాణికంగా తీసుకుని రామాయ‌ణంలోని కొన్ని కీల‌క ఘ‌ట్టాల ఆధారంగా ఈ సినిమాని తెర‌కెక్కించారు ద‌ర్శ‌కుడు ఓం రౌత్‌. క‌థ కంటే కూడా విజువ‌ల్స్‌తో ప్రేక్ష‌కుల్ని క‌ట్టిప‌డేశాడు ద‌ర్శ‌కుడు. లంక‌ని తెర‌పై ఆవిష్క‌రించిన విధానం సినిమాకే హైలైట్‌. హాలీవుడ్ సినిమాల స్ఫూర్తితో ఆ స‌న్నివేశాల్ని ఎంతో నాణ్యంగా తీర్చిదిద్దారు. విజువ‌ల్స్‌పై మ‌రీ ఎక్కువ‌గా దృష్టిపెట్టిన ద‌ర్శ‌కుడు... భావోద్వేగాల్ని మాత్రం ప‌ట్టించుకోలేదు.

ప్రేక్ష‌కుల్ని భక్తి పార‌వ‌శ్యంలో ముంచే గాథ ఇది. ఒకే ప్రాణంగా బ‌తికిన జాన‌కి, రాఘ‌వ మ‌ధ్య ఎడ‌బాటు... హ‌నుమంతుడి విన్యాసాలు, శ్రీరాముడి విలువ‌లు, ఆయ‌న ప‌రాక్ర‌మం త‌దిత‌ర నేప‌థ్యాల్ని వాడుకుని బ‌ల‌మైన భావోద్వేగాల్ని పండించే ఆస్కారం ఉన్నా ద‌ర్శ‌కుడు ఆ విష‌యంలో పెద్ద‌గా ప్ర‌భావం చూపించ‌లేక‌పోయారు. సేతు నిర్మాణానికి వానర‌సైన్యాన్ని సిద్ధం చేయ‌డం, లంక‌లో రావ‌ణుడిపై పోరాటం కోసం సైన్యంలో స్ఫూర్తిని నింపే ఘ‌ట్టాలు మిన‌హా ఏవీ హీరోయిజాన్ని హైలైట్‌ చేయ‌లేక‌పోయాయి. యుద్ధ స‌న్నివేశాలు కూడా సుదీర్ఘంగా సాగినా అందులోనూ విజువ‌ల్సే త‌ప్ప మిగిలిన అంశాలేవీ ఆక‌ట్టుకోలేక‌పోయాయి. పాత్ర‌ల్ని తీర్చిదిద్దిన విధానం మాత్రం మెప్పిస్తుంది. క‌థ‌, క‌థ‌నాల కంటే కూడా... అంచ‌నాల‌కి త‌గ్గ‌ట్టుగా న‌వ‌త‌రం ప్రేక్ష‌కులు, చిన్నారుల్ని అల‌రించే విజువ‌ల్స్‌తో రూపొందిన చిత్ర‌మిది. త్రీడీలో ప్రేక్ష‌కుల్ని మ‌రింత‌గా అల‌రిస్తుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు