Kalki 2898AD : ముంబై లో 'కల్కి' క్రేజ్ మాములుగా లేదుగా.. ఒక్క టికెట్ అన్ని వేలా?

'కల్కి' ద్వారా నార్త్ లో ప్రభాస్ క్రేజ్ మరోసారి బయటపడింది. ముంబై లో ఈ సినిమా టికెట్ వేల రూపాయలు పలికినట్లు తాజా సమాచారం బయటికొచ్చింది. అక్కడ మైసన్​​ ఐనాక్స్​ థియేట‌ర్‌ల‌లో ఈ సినిమా టికెట్లు ఏకంగా రూ.950 నుంచి స్టార్ట్ అయ్యి రూ.2300గా ఉన్నట్లు సమాచారం.

New Update
Kalki 2898AD : ముంబై లో 'కల్కి' క్రేజ్ మాములుగా లేదుగా.. ఒక్క టికెట్ అన్ని వేలా?

Prabhas Kalki Movie Ticket Price In Mumbai : నార్త్ లో ప్రభాస్ కు ఎలాంటి క్రేజ్ ఉందో తెలిసిందే. 'బాహుబలి' తో దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న డార్లింగ్.. ఒక్కో సినిమాతో తన క్రేజ్ ను పెంచుకుంటూ పోతున్నాడు. ప్రభాస్ సినిమా వస్తుందంటే బాలీవుడ్ స్టార్స్ సైతం తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు భయపడుతుంటారు.

ఇక తాజాగా కల్కి ద్వారా అక్కడ ప్రభాస్ క్రేజ్ మరోసారి బయటపడింది. నార్త్ లో కల్కి అడ్వాన్స్ బుకింగ్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. ముంబై లో ఈ సినిమా టికెట్ వేల రూపాయలు పలికినట్లు తాజా సమాచారం బయటికొచ్చింది.

Also Read : తాను సారీ చెప్పిన ఫ్యాన్ ను కలిసిన నాగార్జున.. మరో మెట్టు ఎక్కేసాడంటూ నెటిజన్స్ ప్రశంసలు!

అన్ని వేలా..?

కల్కి మూవీ టికెట్ ధ‌ర‌ల‌కు సంబంధించి ముంబై సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది. ముంబయిలోని మైసన్​​ ఐనాక్స్​ థియేట‌ర్‌ల‌లో ఈ సినిమా టికెట్లు ఏకంగా రూ.950 నుంచి స్టార్ట్ అయ్యి రూ.2300గా ఉన్నట్లు సమాచారం. ఆ రేటుతో కూడా టికెట్స్ అన్నీ సోల్డ్ అవుట్ అవ్వ‌డం విశేషం.

అలానే వీకెండ్​ కోసం ఒక్కో టికెట్​ను రూ.2000కు అమ్ముతోందట. అక్కడి స్టార్ హీరోల సినిమాల టికెట్స్ సైతం ఇంత మొత్తంలో అమ్ముడవ్వలేదు. దీన్ని బట్టి ముంబై లో డార్లింగ్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతుంది. అంతేకాదు నార్త్ లో ఈ సినిమా ఓపెనింగ్స్ కూడా భారీగానే ఉండబోతున్నాయని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు