వాళ్ళను బాధ పెట్టడం ఇష్టంలేకే పెళ్లి చేసుకోలేదు: ప్రభాస్

బుధవారం రామోజీ ఫిలిం సిటీలో జరిగిన 'కల్కి' స్పెషల్ ఈవెంట్ లో యాంకర్ సుమ ప్రభాస్ ను ఆటపట్టించింది. మొన్నెప్పుడో స్పెషల్ వ్యక్తి వస్తుందని అనగానే.. ఎంత మంది అమ్మాయిల గుండెలు పగిలిపోయాయో తెలుసా? అని సుమ అనగానే ప్రభాస్, ఆ అమ్మాయిల కోసమే పెళ్లి చేసుకోలేదు అని అన్నాడు.

New Update
వాళ్ళను బాధ పెట్టడం ఇష్టంలేకే పెళ్లి చేసుకోలేదు: ప్రభాస్

Prabhas Interesting Comments On His Marriage : పాన్ ఇండియా హీరో ప్రభాస్ పెళ్ళికి రెడీ అయినట్లు గత ఏడాది నుంచి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ప్రభాస్ పెద్దమ్మ కూడా ఆ మధ్య ఇదే చెప్పారు. దీంతో డార్లింగ్ మ్యారేజ్ కి సంబంధించి ఎప్పుడెప్పుడు గుడ్ న్యూస్ ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఇటీవల ప్రభాస్ తన ఇన్ స్టా స్టోరీలో తన లైఫ్ లో ఓ స్పెషల్ పర్సన్ వస్తున్నారని పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే కదా.. ఈ పోస్ట్ చూసి అంతా డార్లింగ్ పెళ్లి గురించే అనుకున్నారు. కానీ చివరికి అది కల్కి (Kalki 2898 AD) మూవీ ప్రమోషన్ అని తెలిసి డిజప్పాయింట్ అయ్యారు. అయితే తాజాగా నిర్వహించిన కల్కి స్పెషల్ ఈవెంట్ లో ప్రభాస్ స్వయంగా తన పెళ్లి గురించి చెప్పాడు.

Also Read: సెన్సెక్స్ ఆల్ టైమ్ హై.. రికార్డ్ సృష్టించిన ఇండెక్స్ లు

అందుకే పెళ్లి చేసుకోలేదు

బుధవారం రామోజీ ఫిలిం సిటీలో జరిగిన 'కల్కి' స్పెషల్ ఈవెంట్ లో యాంకర్ సుమ ప్రభాస్ ను ఆటపట్టించింది. మొన్నెప్పుడో స్పెషల్ వ్యక్తి వస్తుందని అనగానే.. ఎంత మంది అమ్మాయిల గుండెలు పగిలిపోయాయో తెలుసా? అని సుమ అనగానే ప్రభాస్, ఆ అమ్మాయిల కోసమే పెళ్లి చేసుకోలేదు అని అన్నాడు. అమ్మాయిలందరినీ బాధ పెట్టడం ఇష్టం లేకే పెళ్లి చేసుకోవడం లేదు అని సుమకు ఫన్నీగా ఆన్సర్ ఇచ్చాడు. దీంతో ప్రభాస్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు