Prabhas : ప్రభాస్ - హను రాఘవపూడి మూవీ నుంచి పోస్టర్ రిలీజ్.. కాన్సెప్ట్ అదిరిపోయిందిగా!

హను రాఘవపూడి - ప్రభాస్ మూవీకి సంబంధించి మేకర్స్ పోస్టర్‌ రిలీజ్ చేశారు. 1940 దశకంలో జరిగే కథ అని పోస్టర్‌లో తెలిపారు. మాతృభూమి ప్రజల కోసం ఒక యోధుడు చేసే పోరాటంగా మూవీ ఉండనుంది. ‘పరిత్రాణాయ సాధూనాం’ అంటూ భగవద్గీతలోని ఒక శ్లోకాన్ని పోస్టర్‌లో చూపించారు.

New Update
Prabhas : ప్రభాస్ - హను రాఘవపూడి మూవీ నుంచి పోస్టర్ రిలీజ్.. కాన్సెప్ట్ అదిరిపోయిందిగా!

Prabhas - Hanu Raghavapudi Movie : హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్నమూవీ లాంచింగ్ ఈవెంట్ నేడు (ఆగస్టు 17) హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు ప్రభాస్, హను రాఘవపూడి, మైత్రీ నిర్మాతలు, ‘సలార్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో పాటు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి మేకర్స్ పోస్టర్‌ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌ అంచనాలను మరింత పెంచింది.

1940 దశకంలో జరిగే కథ అని పోస్టర్‌లో తెలిపింది. పీరియాడిక‌ల్ యాక్ష‌న్ చిత్రంగా తెరకెక్కనుందని మేకర్స్‌ తెలిపారు. మాతృభూమి ప్రజల కోసం ఒక యోధుడు చేసే పోరాటంగా మూవీ ఉండనుంది. ‘పరిత్రాణాయ సాధూనాం’ అంటూ భగవద్గీతలోని ఒక శ్లోకాన్ని పోస్టర్‌లో చూపించారు. ప్రభాస్ లుక్‌, పాత్ర వివరాలేమీ లేకుండా రిలీజ్‌ అయిన ఈ పోస్టర్‌ కే భారీ స్థాయిలో రెస్పాన్స్‌ వస్తోంది.

Also Read : ఆ సెంటిమెంట్ ప్రకారం ‘పుష్ప 2’ ప్లాప్.. నెట్టింట కొత్త రచ్చ

ఇందులో ప్రభాస్‌ ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నాడనేది ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ మూవీకి సంబంధించిన మరింత ఇంట్రెస్టింగ్‌ అప్డేట్స్‌ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రభాస్‌ సైనికుడిగా కనిపించనున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్‌ కానుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు