పూజా కార్యక్రమాలతో మొదలైన హను రాఘవపూడి - ప్రభాస్ మూవీ.. స్టైలిష్ లుక్ లో డార్లింగ్, పిక్స్ వైరల్

ప్రభాస్, హను రాఘవపూడి కాంబోలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. నేడు హైదరాబాద్‌లో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది. ఈ వేడుకకు ప్రభాస్, హను రాఘవపూడి, మైత్రీ నిర్మాతలు, 'సలార్' డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో పాటు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు.

New Update
పూజా కార్యక్రమాలతో మొదలైన హను రాఘవపూడి - ప్రభాస్ మూవీ.. స్టైలిష్ లుక్ లో డార్లింగ్, పిక్స్ వైరల్

Prabhas - Hanu Raghavapudi Movie : ప్రభాస్, హను రాఘవపూడిల కలయికలో తెరకెక్కనున్న సినిమా ఘనంగా ప్రారంభమైంది. నేడు హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది. శనివారం జరిగిన ఈ వేడుకకు ప్రభాస్, హను రాఘవపూడి, మైత్రీ నిర్మాతలు, 'సలార్' డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో పాటు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు.

publive-image

ఈ లాంఛ్ ఈవెంట్ కి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా వచ్చే వారం అంటే ఆగస్టు 24 నుంచి షూటింగ్ కూడా మొదలు కానుందని అంటున్నారు. ఈ చిత్రానికి ‘ఫౌజీ’ అనే టైటిల్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

publive-image

ప్రభాస్ కెరీర్‌లో మరో భారీ ప్రాజెక్ట్‌గా ఈ చిత్రం రూపొందనుంది. హను రాఘవపూడి ఈ సినిమాతో పాన్ ఇండియా దర్శకుడిగా మారేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సైనికుడి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు ? మ్యూజిక్ డైరెక్టర్ తదితర వివరాలను చిత్ర యూనిట్ త్వరలోనే తెలుపనుంది.

publive-image

Advertisment
Advertisment
తాజా కథనాలు