Prabhas Salaar: ఫుల్ బాటిల్ కు ఈ స్టఫ్ సరిపోద్దా?

'సలార్' సినిమా పోస్టర్ లో ప్రభాస్ మొహం కనిపించకుండా కేవలం బాడీ మాత్రమే రివీల్ చేశారు. ఇక రాబోయే ట్రైలర్ లో నైన ప్రభాస్ ఫేస్ కనిపిస్తుందా లేదా..? ఇంత మంచి కిక్ ఇచ్చే సినిమాకు స్టఫ్ ఇవ్వడం లేదని ప్రభాస్  ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

Prabhas Salaar: ఫుల్ బాటిల్ కు ఈ స్టఫ్ సరిపోద్దా?
New Update

Prabhas Salaar: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'సలార్' సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమా థియేటర్స్ లోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. KGF లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను డైరెక్ట్ చేసిన ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకెక్కించడంతో.. ప్రభాస్ అభిమానుల్లో 'సలార్' పై భారీ అంచనాలు పెరిగాయి. ఇప్పటికే ఈ సినిమాను సెప్టెంబర్ లో విడుదల చేస్తామని ప్రకటించిన మేకర్స్.. మళ్ళీ డిసెంబర్ కు వాయిదా వేశారు. మరో సారి కూడా ఈ సినిమా వాయిదా పడనున్నట్లు సోషల్ మీడియాలో గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి. అయిన సరే సినిమా పై ఫ్యాన్స్ అంచనాలు ఏ మాత్రం తగ్గలేదు. బాహుబలి సినిమా తర్వాత వచ్చిన 'రాధేశ్యామ్,' 'ఆదిపురుష్' బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా సక్సెస్ కానప్పటికీ.. అభిమానుల్లో ప్రభాస్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. 'సలార్' కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ దాదాపు రెండు సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు.

publive-image

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబోలో రాబోతున్న మంచి కిక్ ఇచ్చే ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు చాలా యాక్టీవ్ గా ఎదురు చూస్తారు ప్రభాస్ ఫ్యాన్స్. ఏడాది క్రితం విడుదల చేసిన సినిమా పోస్టర్ లో కూడా ప్రభాస్ మొహం కనిపించకుండా కేవలం బాడీ మాత్రమే రివీల్ చేశారు.  అయినా సరే సినిమాకు సంబంధించి మంచి అప్డేట్ ఇస్తారని ప్రభాస్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఆశతో ఎదురుచూస్తున్నారు. కనీసం సినిమాలోని ప్రభాస్ పోస్టర్స్ అయిన రిలీజ్ చేసి సినిమాకు హైప్ క్రియేట్ చేయాలి.. ఇంకా ఎంత కాలం ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబో అనే బ్రాండ్ తో ప్రచారం చేస్తారని అభిమానుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

publive-image

ఇక రాబోయే ట్రైలర్ లో నైన ప్రభాస్ ఫేస్ కనిపిస్తుందా లేదా దాంట్లో కూడా కేవలం ప్రభాస్ స్టాండింగ్ పొజీషన్ తోనే సరిపెడతారా.. ఇంత మంచి కిక్ ఇచ్చే సినిమాకు స్టఫ్ ఇవ్వడం లేదని ప్రభాస్  ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  సినిమా పై ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ తగ్గకుండా పాన్ ఇండియా స్థాయిలో ప్రభాస్ కటౌట్లు ఏర్పాటు చేసి ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ చేయాలనీ చూస్తున్నారు. ఢిల్లీ, ముంబై వంటి నార్త్ స్టేట్స్ లో ప్రభాస్ కటౌట్లు ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది.

publive-image

Also Read: Sharwanand: తండ్రి కాబోతున్న టాలీవుడ్ హీరో.!

#prabhas-salaar-movie-postponed #prabhas-salaar-movie #salaar-movie
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe