Powerful Ministers: అధికారంలో యువరక్తం.. పవన్, లోకేష్ తో పాటు పవర్ ఫుల్ టీమ్ ఇదే.. ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో కొత్త మంత్రివర్గం కొలువు తీరింది. పాత, కొత్త మేలి కలయికగా ఉన్న ఈ మంత్రివర్గంలో పవన్, లోకేష్ లతో పాటు 12 మంది యువ నేతలపై అందరి దృష్టి ఉంది. పవర్ ఫుల్ మంత్రులుగా భావిస్తున్న వీరి గురించి సంక్షిప్తంగా ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 13 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి Powerful Ministers: ఎన్నికలు అయిపోయాయి.. ఫలితాలు తేలిపోయాయి.. కొత్త ప్రభుత్వాలు కొలువు తీరాయి. ఈసారి ఎన్నికల్లో ఒక ప్రత్యేకత ఉంది. పాత తరం నాయకుల్లో చాలామంది కనుమరుగైపోగా.. కొత్త తరం పదవులు చేపట్టింది. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వంలో కొత్త రక్తం పరవళ్లు తొక్కుతోంది. కొత్త పాత కలయికగా ఉన్న మంత్రి వర్గ కూర్పులో కొత్తగా కనిపిస్తున్నవారిలో ఎక్కువగా యువతరమే ఉంది. సీనియర్లను దాదాపుగా పక్కకు పెట్టి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు కొత్త చరిత్రకు తెరతీశారని చెప్పవచ్చు. ఇప్పుడు ఏపీ మంత్రి వర్గంలోని కొత్త.. యువ నాయకుల గురించి ఒక పరిశీలన చేద్దాం. కొణిదెల పవన్ కల్యాణ్.. (55) 2008లో ప్రజారాజ్యం పార్టీ యువజన విభాగ అధ్యక్షుడిగా రాజకీయ ఆరంగేట్రం ఇచ్చిన ఈ ఫిలిం స్టార్.. తరువాత 2014లో జనసేన పార్టీ స్థాపించారు. అప్పుడు కూటమికి అనుకూలంగా పోటీ చేయలేదు. 2019 లో ఒంటరిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఇప్పుడు పడిలేచిన కెరటంలా గెలుపు సాధించి మంత్రిగా ప్రమాణం చేశారు నారా లోకేష్.. (41) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు. 2017లో ఎమ్మెల్సీ గా ఎన్నికయి ఐటీ శాఖా మంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీచేసి ఓడిపోయారు. యువగలం పేరుతొ 3.100 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ఈ ఎన్నికల్లో గెలిచి రెండోసారి మంత్రి అయ్యారు. నిమ్మల రామానాయుడు.. (55) పాలకొల్లు నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు గెలిచారు. 2019 లో వైసీపీ ప్రభంజనాన్ని తట్టుకున్నారు. తొలిసారిగా మంత్రిగా నిలిచారు. టీజీ భారత్.. (48) కాంగ్రెస్ పార్టీ నుంచి 2014లో తెలుగుదేశంలోకి వచ్చారు. ఆ ఎన్నికల్లో కర్నూలు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు మళ్ళీ కర్నూలు నుంచే పోటీ చేసి గెలిచారు. మంత్రిగా ప్రమాణం చేశారు. ఎస్.సవిత.. (47) తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆమె మాజీమంత్రి ఉషశ్రీచరణ్ పై గెలిచారు. అందుకే మంత్రి పదవి వరించింది. గుమ్మడి సంధ్యారాణి.. (50) 2015లో టీడీపీ నుంచి ఎమ్మెల్సీ గా పనిచేసిన గుమ్మడి సంధ్యారారాణి అరకు నియోజకవర్గం నుంచి ఈ ఎన్నికల్లో పోటీచేసి గెలిచారు. మంత్రి మండలిలో చేరారు. కొండపల్లి శ్రీనివాస్.. (41) అమెరికాలో ఎంఎస్ చేసిన కొండపల్లి శ్రీనివాస్ బొబ్బిలి నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. మంత్రిగా ఎంపిక అయ్యారు. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి..(44) వైసీపీ నుంచి మూడేళ్ళ క్రితం టీడీపీకి వచ్చిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఈ ఎన్నికల్లో రాయచోటి నుంచి ఎమ్మెల్యే అయ్యారు. ఆయనకు మంత్రి పదవి వరించింది. వాసంశెట్టి సుభాష్.. (47) 2019లో వైసీపీ రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శిగా పనిచేసి అమలాపురం అల్లర్ల తరువాత టీడీపీలో చేరారు. ఈ ఎన్నికల్లో రామచంద్రాపురం నుంచి తొలిసారిగా పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. మంత్రి పదవి చేపట్టారు. గొట్టిపాటి రవికుమార్.. (48) 2014లో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఈయన 2019లో టీడీపీలోకి వచ్చారు. 2019, 2024 రెండు ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పుడు ఈయన మంత్రిగా ఎంపిక అయ్యారు. వంగలపూడి అనిత.. (45) 2013లో టీచర్ వృత్తికి రిజైన్ చేసి రాజకేయాల్లోకి వచ్చారు. టీడీపీ తరపున 2014లో పాయకరావుపేట నుంచి గెలిచారు. 2019లో కొవ్వూరు నుంచి ఓడిపోయారు. ఇప్పడు మళ్ళీ పాయకరావుపేట నుంచి పోటీచేసి మంత్రి పదవి కొట్టేశారు. డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి.. (54) 2009లో ప్రభుత్వ వైద్యుడిగా వృత్తి వదిలి టీడీపీ లో చేరారు.. అప్పుడు ఓడారు. 2014, 2019లో గెలిచారు.. ఇప్పుడు మంత్రి ఆదిమూలపు సురేష్ పై గెలిచి మంత్రి పదవి చేపట్టారు. అనగాని సత్యప్రసాద్.. (52) రేపల్లె నుంచి 2009లో టీడీపీ అభ్యర్థిగా ఓటమి చెందారు. తరువాత 2014, 2019, 2024 ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. మంత్రి పదవి ఎగరేసుకు పోయారు. మొత్తం 24 మంది మంత్రుల్లో.. 12 మంది యువ మంత్రులు ఉన్నారు. వీరిలో చాలామంది మొదటిసారి గెలిచినవారు లేదా రెండోసారి గెలిచి తొలిసారిగా మంత్రిపదవి చేపట్టినవారిగా ఉన్నారు. ఇప్పుడు ఏపీలో ఎమ్మెల్యేలలో కూడా యువకులు చాలామంది ఉన్నారు. వీరంతా తమ జీవితాలకు వెలుగు తీసుకువస్తారని ప్రజలు ఆశతో ఎదురుచూస్తున్నారు. #ap-cabinet #ap-ministers మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి