Pawan Kalyan: పవర్ స్టార్ నుంచి పవర్ ఫుల్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్.. దేశంలో ఒకే ఒక్కడు!

పవర్ స్టార్ గా ప్రజల్లో ప్రత్యేక స్థానం ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు పవర్ ఫుల్ డిప్యూటీ సీఎం. ప్రస్తుతం దేశంలోనే ఇంత పవర్ ఫుల్ డిప్యూటీ ఎవరూ లేరు. అసలు పవన్ కు ఇంత స్థాయి ఎలా వచ్చింది? పవన్ కళ్యాణ్ ఏరి కోరి పంచాయతీరాజ్ శాఖను తీసుకోవడం ఎందుకు? తెలుసుకుందాం

Pawan Kalyan: పవర్ స్టార్ నుంచి పవర్ ఫుల్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్.. దేశంలో ఒకే ఒక్కడు!
New Update

Pawan Kalyan: పవన్ కళ్యాణ్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడ విన్నా ఇదే పేరు. పవర్ స్టార్ నుంచి పవర్ఫుల్ ఉప ముఖ్యమంత్రిగా ఆయన అందరినీ ఆకర్షిస్తున్నారు. జాతీయ మీడియాలోనూ ఇప్పుడు పవన్ పేరు మోగుతోంది. రాజకీయాలకు పనికిరాడు అని అందరూ ఎద్దేవా చేసిన వ్యక్తి.. రాష్ట్ర రాజకీయాలను పూర్తిగా మెలిపెట్టి మలుపు తిప్పేశారు. రాజకీయాలంటే సినిమాలు కాదు అంటూ ఎగతాళి చేసిన వారికి చెమటలు పాట్టించి.. జాతీయ రాజకీయాల్లోనూ ప్రాధాన్యత గలిగిన నాయకుడిగా ఎదిగారు. డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఏమిటి అనేది ఇప్పుడు ఏపీలో ప్రత్యక్షంగా చూపిస్తున్నారు పవన్ కళ్యాణ్. అనుభవజ్ఞుడైన చంద్రబాబు ఫ్రంట్ ఇంజన్ గా.. ప్రజాబలం కలిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ రెండో ఇంజన్ గా ఏపీ అభివృద్ధి పరుగులు తీయబోతోందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. 

ఒకే ఒక్కడు..

Pawan Kalyan: ఉప ముఖ్యమంత్రి పదవి ఇప్పటి వరకూ మన రాష్ట్రంలో చాలా మందికి అంది వచ్చింది. హోమ్ మినిస్టర్ గా ఉంటూ డిప్యూటీ సీఎం గా పనిచేసిన వారు కూడా ఏపీలో ఉన్నారు. కానీ, ఇప్పటివరకూ ఏ ఉప ముఖ్యమంత్రి పేరు కూడా ప్రజలకు గుర్తులేదు. అసలు వాళ్ళంతట వాళ్ళు చెప్పుకుంటే తప్ప డిప్యూటీ సీఎం అనే విషయమూ తెలియని పరిస్థితి ఉంది. కానీ, పవన్ కల్యాణ్ అలాకాదు.. ఆయనకు డిప్యూటీ ఇవ్వడమే కాకుండా.. ప్రతి ఆఫీసులోనూ.. ముఖ్యమంత్రితో సమానంగా ఆయన ఫోటో కూడా పెట్టాలి అని ఆదేశాలు కూడా ఇవ్వడం పవన్ కళ్యాణ్ రేంజ్ కు నిదర్శనం. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వ్యూహం పవన్ కళ్యాణ్ ది.

publive-image

Pawan Kalyan: ఏపీలో గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనూ ఉప ముఖ్యమంత్రి పదవులు ఉన్నాయి.. మొన్న దిగిపోయిన వైసీపీ సర్కారులో అయితే దాదాపు ఐదుగురు డిప్యూటీ పదవులు అనుభవించారు. కానీ, వారిలో ఎవరికీ కూడా కనీస ప్రాధాన్యత లేని పరిస్థితి. మంత్రివర్గ పేర్లు ప్రకటించిన సందర్భంలో తప్ప మరెప్పుడూ కూడా వారి పేర్లు ఎవరికీ వినపడని పరిస్థితి. నిజానికి డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగ బద్ధమైన పదవి కాకపోయినా.. ప్రజల్లో ఉప ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి తరువాత అంత స్థాయి ఉన్న మంత్రి అనే అభిప్రాయం ఉండేది. కానీ, ఆ అభిప్రాయాన్ని కూడా గతంలో ఉన్న డిప్యూటీలు చెరిపేశారు. కానీ, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రజల అభిప్రాయానికి దగ్గరగా వచ్చారు. ఏపీ రాష్ట్ర చరిత్రలో పవన్ కళ్యాణ్ ఒక్కరే డిప్యూటీగా ఇంత స్థాయిలో గౌరవం అందుకుంటున్న వారు అనడంలో అతిశయోక్తి లేదు. ఇక జాతీయ స్థాయిలో చూసినా ఒక్క కర్ణాటకలో తప్ప (మొన్నటి ఎన్నికల తరువాత డీకే శివకుమార్ కు కాంగ్రెస్ డిప్యూటీ సీఎం హోదా ఇచ్చింది) ఎక్కడ కూడా ఉప ముఖ్యమంత్రులుగా ఇంత క్రేజ్ ఉన్నవారు లేరు. 

publive-image

ఎందుకింత క్రేజ్..

Pawan Kalyan: నిజానికి పవన్ కళ్యాణ్ కు ఉన్న ఫ్యాన్ బేస్ అటువంటిది. పడినా.. లేచినా హుందాగా ప్రవర్తించగలిగిన నైజం ఉన్న వ్యక్తి ఆయన. ఎన్నికలకు చాలా ముందుగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ భవిష్యత్ ను ఊహించగలిగిన నాయకుడు పవన్. అనుమానాలతోనే తెలుగుదేశం పార్టీ పవన్ జట్టు కట్టిందనేది వాస్తవం. తరువాత దగ్గరగా పవన్ ను చూసిన తరువాత.. ఆయనతో కలిసి అడుగులు వేసినప్పుడు పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం టీడీపీ నేతలకు అర్ధం అయింది. ప్రజల పట్ల.. రాష్ట్ర అభివృద్ధి పట్ల ఆయన కమిట్మెంట్ పై అవగాహన కలిగింది. దానిని ఎన్నికల ఫలితారు రుజువు చేశాయి.

publive-image

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానంలో ఆయన కులస్థులు కూడా ఎప్పుడూ ఆయనను నమ్మలేదు. ఇంకా చెప్పాలంటే కాపు కులంలో పెద్ద నాయకులుగా చెప్పుకునేవారు ఎప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ ను అప్రతిష్ట పాలు చేయడానికి.. ప్రజల్లో పలుచన చేయడానికి ప్రయత్నిస్తూ వచ్చారు. కానీ, పవన్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ప్రజల్లో తనకున్న ఇమేజ్ ఏమిటో తనకు తెలుసు. భిన్నాభిప్రాయాలున్న పార్టీ క్యాడర్.. యువతను (ఒకరిద్దరు వదిలిపెట్టి పోయినా సరే) ఒక్కతాటి మీదకు టీయూస్కు రావడానికి పవన్ చేసిన ప్రయత్నానికి దక్కిన ఫలితమే ఈరోజు ఉపముఖ్యమంత్రిగా ఆయన ఉన్నత స్థాయిలో ఉండడానికి కారణం అని చెప్పవచ్చు. నిజానికి పవన్ కళ్యాణ్ రాజకీయనాయకుడు అని అనడం కూడా తప్పనిపిస్తుంది. ఆయన ఒక ప్రభావశీలి. తన మాటలతో.. చేతలతో ప్రజల్ని ప్రభావితం చేయగలిగిన నాయకుడు. ఒకప్పుడు ఎన్టీఆర్ ఏవిధంగా అయితే రాజకీయాల్లో ఒక ప్రభావాన్ని సృష్టించారో.. అదే ప్రభావాన్ని పవన్ మళ్ళీ సృష్టించగలిగారు. 

publive-image

పవర్ స్టార్ టు పవర్ఫుల్ మినిష్టర్..

Pawan Kalyan: రాజకీయాల్లో వచ్చినప్పటి పవన్ వేరు.. ఇప్పటి ఉపముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన పవన్ వేరు. రాజకీయంగా.. నాయకునిగా ఎంతో పరిణితి చెందారు. ఉపముఖ్యమంత్రిగా హోమ్ శాఖ చంద్రబాబు ఆఫర్ చేశారని వార్తలు వచ్చాయి. అలాగే, ప్రజల దృష్టిలో కూడా హోమ్ మినిస్ట్రీ అంటే పవర్ ఫుల్ అనే అభిప్రాయం ఉంది. అందుకే అందరూ హోమ్ శాఖ పవన్ కళ్యాణ్ తప్పకుండా తీసుకుంటారని అనుకున్నారు. కానీ, దానికి భిన్నంగా హోమ్ మినిస్ట్రీ నాకు వద్దు అని చెప్పి.. ఏరి కోరి పంచాయతీరాజ్ శాఖను తీసుకున్నారు. ప్రజల్లో చాలామందికి తెలియని విషయం ఏమిటంటే పంచాయతీరాజ్ శాఖ మొత్తం పోర్ట్ ఫోలియోలన్నిటికంటే పవర్ ఫుల్. ఎందుకంటే,ప్రజలకు దగ్గరగా.. ప్రజల కోసం నిలబడి పనిచేసే అవకాశాన్ని ఆ శాఖ ఇస్తుంది. రాష్ట్రంలో ప్రతి మూల ఉన్న పల్లెతోనూ ఆ శాఖకు ప్రత్యక్షమైన లింక్ ఉంటుంది. మిగిలిన శాఖల్లో ఆ అవకాశం ఉండదు. ఇప్పుడు ఈ పవర్ ఫుల్ శాఖకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంత్రి అయ్యారు. సినిమాల్లోనే పవర్ చూపించిన కళ్యాణ్ బాబు.. రాజకీయాల్లో సునామీ సృష్టించిన పవన్.. ఇప్పుడు పవర్ ఫుల్ పంచాయతీరాజ్ మంత్రిగా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి. 

#janasena #pawan-kalyan
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe