/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/og-jpg.webp)
Power Star Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఫ్యాన్స్ క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన మూవీ అంటే అభిమానులకు పెద్ద పండుగే. పవన్ బర్త్ డే కానుకగా ఓజీ (OG) సినిమా గ్లింప్స్ అలా విడుదల చేసారో లేదో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ‘పదేళ్ల క్రితం బాంబేలో వచ్చిన తుపాన్ గుర్తుందా. అది మట్టి, చెట్లతో పాటు సగం ఊరినే మింగేసింది. కానీ వాడు నరికిన మనుషుల రక్తాన్ని మాత్రం ఇప్పటికి ఏ తుపాన్ కడగకలేకపోయింది. అలాంటోడు మళ్లీ తిరిగివస్తున్నాడంటే..’ అంటూ సాగే వాయిస్ ఓవర్‌తో పవన్ కల్యాణ్ గ్యాంగ్‌స్టర్‌గా స్టయిలిష్ లుక్‌లో సరికొత్తగా కనిపించారు. ఆయన మేనరిజంతో అభిమానులకు పూనకాలు తెప్పించారు. థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ మూవీలో ప్రియాంకా ఆరుళ్ మోహన్ హీరోయిన్గా నటిస్తున్నారు.