సోషల్ మీడియాలో పోస్టింగులు..ట్రోలింగ్స్ మంచిది కాదు సోషల్ మీడియా పోస్టింగులపై మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. పోస్టింగులు, ట్రోలింగ్స్‌పై ఆమె మండిపడ్డారు. సోషల్ మీడియాలో ముకారాలు, లకారాలు ఎక్కువైపోయాయి. ప్రస్తుతం సమాజంలో సోషల్ మీడియా హత్యలు చూస్తున్నాం. సీఎం జగన్ కుటుంబంపై ఇష్టానుసారంగా పోస్టులు పెట్టడం ఎంతవరకూ సమంజసమన్నారు. By Vijaya Nimma 30 Jun 2023 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి ఈ పద్దతి మంచిదేనా..? సోషల్ మీడియా పోస్టింగులపై మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ పోస్టింగులు, ట్రోలింగ్స్ మండిపడ్డారు. సోషల్ మీడియాలో ముకారాలు, లకారాలు ఎక్కువైపోయాయి. ప్రస్తుతం సమాజంలో సోషల్ మీడియా హత్యలు చూస్తున్నాం. సీఎం జగన్ కుటుంబంపై ఇష్టానుసారంగా పోస్టులు పెట్టడం ఎంతవరకూ సమంజసం. సీఎం కుటుంబ సభ్యులపై చూడలేని విధంగా పోస్టులు పెట్టిన వ్యక్తి శ్వేతా చౌదరి కాదా..?, యూకేలో ఉంటూ స్వాతిరెడ్డి పేరుతో ఇలాంటి పోస్టులు పెడుతుంది. ఇలాంటివారిని చంద్రబాబు భుజం తట్టి ప్రోత్సహిస్తారా?, మీ పార్టీ వాళ్లైతే చంద్రబాబు అలాగే ప్రోత్సహిస్తారా?, మహిళలు వేరే మహిళలపై పోస్టులు పెట్టడం వెంటనే ఆపాలన్నారు. పోలీసులు కఠినంగా ఉండాలి అక్రమ సంబంధాలను అంటగట్టి జుగుప్సాకరంగా వ్యవహరిస్తున్నారు. సోషల మీడియాలో పోస్టులపై పోలీసులు కఠినంగా వ్యవహరించలేని పరిస్థితి ఉంది. సోషల మీడియా పోస్టులు వ్యక్తిత్వ హననంగా మారింది. జులై 5న సెమినార్ నిర్వహించి కార్యాచరణ తీసుకొస్తాం అని వాసిరెడ్డి పద్మ వెల్లడించారు. రాజకీయ నేతలను కించపరచడానికి వాళ్ల ఇళ్లల్లోని మహిళలపై పోస్టింగులు పెట్టడం సరికాదు. రెండు వైపులా ఈ తరహా ధోరణులు జుగుప్సాకరంగా పరిస్థితులు ఉన్నాయి. శ్వేతా చౌదరి అనే మహిళ స్వాతి రెడ్డి అనే ముసుగు వేసుకుని అశ్లీలంగా మాట్లాడితే చంద్రబాబు ప్రొత్సహిస్తారా..?, చివరకు స్వాతి రెడ్డి కూడా సోషల్ మీడియా బాధితురాలు అయింది. సోషల్ మీడియా పోస్టింగులపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారనే చర్చ జరగాలి. చట్టాలు సవరించాలి ఒక పోస్టింగ్ మీద చర్యలుంటే దీనికి కట్టడి పడుతుందేమో..? వ్యక్తిత్వ హననం అనేది హత్యానేరంతో సమానంగా చూడాలి. సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగులపై చర్యలు తీసుకునేలా చట్టాలు సవరించాలని కోరుతున్నాం. సోషల్ మీడియా వ్యవహారంపై జులై 5వ తేదీన మహిళా కమిషన్ సెమినార్ నిర్వహిస్తుంది. సోషల్ మీడియా పోస్టుల మీద అరెస్టులు చేయొద్దని కోర్టులు చెబుతున్నాయి. యాసిడ్ దాడిని ఎలా చూస్తున్నామో.. సోషల్ మీడియాలో మహిళలపై ట్రోలింగులను ఇదే తరహాలో చూడాల్సిన అవసరం ఉందని వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి