Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పది అర్హతతో 40 వేల పోస్టల్ ఉద్యోగాలు!

నిరుద్యోగులకు మరో తీపి కబురు అందింది. పది అర్హతతో రాత పరీక్ష లేకుండా 40 వేల ఉద్యోగాలకు పోస్టల్ డిపార్ట్ మెంట్ జనవరిలో విడుదల చేసిన నోటిఫికేషన్ కు లైన్ క్లియర్ అయింది. త్వరలోనే ధరఖాస్తుల ప్రక్రియ మొదలవనుండగా పూర్తి వివరాలకోసం ఆర్టికల్ లోకి వెళ్లండి.

New Update
Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పది అర్హతతో 40 వేల పోస్టల్ ఉద్యోగాలు!

Postel jobs: నిరుద్యోగులకు పోస్టల్ డిపార్ట్ మెంట్ నుంచి గుడ్ న్యూస్ అందింది. దేశ వ్యాప్తంగా ఉన్న పోస్టల్ సర్కిళ్లలో 2024-25 సంవత్సరానికిగానూ గ్రామీణ సేవా సడక్ (జీడీఎస్) పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పది అర్హతతో 40వేల ఉద్యోగాలకు జనవరి 2024లో నోటిఫికేషన్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. కాగా దేశంలో ఎన్నికల కోడ్ కారణంగా ఈ రిక్రూట్ మెంట్ వాయిదా పడింది. అయితే తాజాగా కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ఉద్యోగాలకు భర్తీకీ లైన్ క్లియర్ అయింది. త్వరలోనే నోటిఫికేషన్ విడుదలకానుంది.

ఇది కూడా చదవండి: AP Deputy Speaker: జనసేనకు డిప్యూటీ స్పీకర్.. ఆ ఎమ్మెల్యేకు ఛాన్స్?

ఈ మేరకు ఎలాంటి రాత పరీక్ష లేకుండానే 10వ తరగతి మార్కుల ఆధారంగా ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. 18-40 ఏళ్ల మధ్య వయస్కులు ఈ ఉద్యోగాలకు అర్హులు కాగా.. ఎస్సీ, ఎస్టీ లకు ఐదేళ్లు, ఓబీసీలకు 3, వికలాంగ అభ్యర్థులకు 10ఏళ్ల సండలింపు అవకాశం కల్పించారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు బ్రాంచ్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ మాస్టర్ (ABPM) డాక్ సేవక్ హోదాలతో విధులు నిర్వహించాలి. మొదట 10-12 జీతంతోపాటు మిగతా ఇన్సెటీవ్స్ అందిస్తారు.

Advertisment
తాజా కథనాలు