Post Office Scheme: పదవీ విరమణ తర్వాత స్థిరమైన ఆదాయాన్ని పొందాలనుకుంటున్నారా? ఇందుకోసం విశ్వసనీయ గల సంస్థ కోసం వెతుకుతున్నారా? మరెందుకు ఆలస్యం.. పోస్టాఫిస్ ఉండగా! ప్రభుత్వ భాగస్వామ్యంతో నడుస్తున్న పోస్టాఫిస్‌కు మించిన సురక్షితమైన పెట్టుబడి గమ్యస్థానం మరొకటి లేదనే చెప్పాలి. రిటైర్‌మెంట్ తరువాత నెలవారీ పెన్షన్ పొందేందుకు పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. దీని ద్వారా మీ పెట్టుబడి సురక్షితంగా ఉండటంతో పాటు.. ఆకర్షణీయమైన రాబడి కూడా ఉంటుంది.
పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకం..
పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్.. మీరు నెలవారీగా పెట్టుబడి పెట్టడానికి, మీరు డిపాజిట్ చేసిన మొత్తానికి వడ్డీ రూపంలో క్రమం తప్పకుండా నెలవారీ పెన్షన్ పొందడానికి అవకాశం ఉంటుంది.
ఇదికూడా చదవండి: అత్యధి మైలేజీ కార్ల కోసం చూస్తున్నారా? బెస్ట్ మైలేజ్ ఇచ్చే కార్ల వివరాలు మీకోసం..
పోస్ట్ ఆఫీస్ మంథ్లీ స్కీమ్: ప్రస్తుత వడ్డీ రేటు
పోస్ట్ ఆఫీస్ మంథ్లీ స్కీమ్ ప్రస్తుతం వడ్డీ రేటు 7.4 శాతంగా ఉంటుంది. పెట్టుబడి పెట్టిన మొత్తంపై గరిష్టంగా రూ. 9,250 నెలవారీ పెన్షన్‌ను పొందే అవకాశం కల్పిస్తోంది ఈ స్కీమ్.
పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకం: జాయింట్ అకౌంట్..
మీరు మీ జీవిత భాగస్వామితో వ్యక్తిగత లేదా ఉమ్మడి ఖాతాను ఎంచుకున్నా, మెచ్యూరిటీ వ్యవధి తర్వాత ప్రిన్సిపల్ మొత్తాన్ని ఉపసంహరించుకునే సౌలభ్యంతో ఈ పథకం సురక్షితమైన పెట్టుబడిని నిర్ధారిస్తుంది.
పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకం: మెచ్యూరిటీ వ్యవధిని పొడిగించుకోవచ్చు..
మీరు స్కీమ్‌ని మరో ఐదేళ్ల పాటు పొడిగించుకునే అవకాశం కూడా ఉంది. మీరు మీ జీవిత భాగస్వామితో ఉమ్మడి ఖాతాను తీసుకున్నట్లయితే.. ఈ పథకం కింద రూ. 1,11,000 వార్షిక వడ్డీని కల్పిస్తుంది. ఇకక పెట్టుబడి పరిమితిని రూ. 15 లక్షలకు పెంచింది.
పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకం: ప్రీమెచ్యూర్
ఈ పథకంలో ప్రీమెచ్యూర్ క్లోజర్ ఆప్షన్‌లు కూడా ఉన్నాయి. ఇన్వెస్టర్లు డిపాజిట్ చేసిన తేదీ నుండి ఒక సంవత్సరం తర్వాత పాక్షిక ఉపసంహరణలు చేయడానికి వీలు కల్పిస్తుంది. ఉపసంహరణ సమయం ఆధారంగా 1 నుండి 2 శాతం వరకు డిపాజిట్ చేసిన మొత్తం నుండి మినహాయింపు ఉంటుంది.
ఇదికూడా చదవండి: వాసివాడి తస్సాదియ్యా.. పొలిటికల్ పార్టీల పెండ్లి.. శుభలేఖ చూస్తే అవాక్కవ్వాల్సిందే..!