Hyderabad: హైదరాబాద్ లో వీటిని అస్సలు మిస్ అవ్వకండీ.. ఏంటో తెలుసా..?

హైదరాబాద్ లో స్ట్రీట్ ఫుడ్ చాలా ఫేమస్.అయితే ఇక్కడ ఖచ్చితంగా ట్రై చేయాల్సిన పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ ఇవే. హైదరాబాదీ బిర్యాని, ఇరానీ చాయ్ విత్ ఉస్మానియా బిస్కెట్స్, డబుల్ కమీట, హలీం, మిర్చీ.

New Update
Hyderabad: హైదరాబాద్ లో వీటిని అస్సలు మిస్ అవ్వకండీ.. ఏంటో తెలుసా..?

Hyderabad Street Food:  హైదరాబాద్ లో స్ట్రీట్ ఫుడ్ కల్చర్ బాగా ఫేమస్. సమోసా నుంచి బిర్యానీ వరకు ఎన్నో రకాల ఫుడ్స్ ఉంటాయి. విదేశాల నుంచి వచ్చిన వారు కూడా హైదరాబాద్ ఫుడ్ కు ఫ్యాన్స్ అయిపోతుంటారు. అంత రుచికరమైన డిషెస్ ఇక్కడ దొరుకుతాయి. అయితే వీటిలో కొన్ని మాత్రం చాలా పాపులర్ . హైదరాబాద్ వస్తే వాటిని ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. అవేంటో ఇప్పుడు చూద్దాం..

బిర్యానీ

బిర్యానీ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. బిర్యానీ అనేది పేరు కాదు ఒక ఎమోషన్ అనే స్తాయిలో ఉంటుంది దీని క్రేజ్. ముఖ్యంగా హైదరాబాద్ బిర్యానీ మరింత ఫేమస్. ఇక్కడ దీన్ని తప్పకుండా ట్రై చేయాల్సిందే. సహజమైన స్పీసెస్ తో చేసే ఈ హైదరాబాదీ బిర్యానీ నోటికి కమ్మని రుచిని అందిస్తుంది.

డబుల్ కమీట్

ఇది హైదరాబాదీ ఫేమస్ డేజర్ట్. బ్రెడ్ ముక్కలు, డ్రై ఫ్రూట్, పాలు, చక్కెర, యాలకులు, నెయ్యితో తయారు చేసే ఈ స్వీట్ చాలా రుచికరంగా ఉంటుంది. అంతే కాదు ఈ డేజర్ట్ చాలా పాపులర్ కూడా.

publive-image

హలీమ్

ముఖ్యంగా రంజాన్ సీజన్ లో ఈ డిష్ చాలా పాపులర్. ఇది కేవలం హైదరాబాదీ ఫేమస్ డిష్ మాత్రమే కాదు GI గుర్తింపును కూడా పొందింది. మాంసం, వీట్, బార్లీ కలయికతో తయారు చేసే ఈ వంటకం హైదరాబాద్ లో ఎంతో ప్రాముఖ్యతను సొంతం చేసుకుంది. ఇక్కడ ట్రై చేయాల్సిన స్ట్రీట్ ఫుడ్ లో హలీమ్ ముందు ప్లేస్ లో ఉంటుందని చెప్పొచ్చు.

ఇరానీ చాయ్ విత్ ఉస్మానియా బిస్కెట్స్

హైదరాబాద్ లో ఇరానీ చాయ్ విత్ ఉస్మానియా బిస్కెట్స్ తప్పకుండా ట్రై చేయాలి. స్ట్రాంగ్ చాయ్.. దాంట్లోకి కాస్త ఉప్పుగా, స్వీట్ గా ఉండే ఉస్మానియా బిస్కెట్స్ నెక్స్ట్ లెవెల్ కాంబినేషన్. కానీ కొన్ని పాపులర్ ప్లేసెస్ లో మాత్రమే దీని అసలు టెస్ట్ దొరుకుతుంది. అక్కడే ట్రై చేయాలి ఉదాహరణకు చార్మినార్.

మిర్చీ బజ్జీ

publive-image

ఇండియన్ స్నాక్స్ లో ఎప్పటికీ బోర్ కొట్టిన ఐటమ్స్ ఏవైనా ఉన్నాయంటే అవి సమోసా, మిర్చీ బజ్జీ. ఇవి అంటే ఇష్టం లేని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. శనగ పిండితో చేసే ఈ బజ్జీలను డీప్ ఫ్రై చేశాక.. కాస్త ఉల్లిపాయలు,నిమ్మకాయ రసంతో గార్నిష్ చేసుకొని తింటే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ముఖ్యంగా వర్షం పడినప్పుడు వీటిని తినడానికి బాగా ఇష్టపడతారు.

ఇది కూడా చదవండి: మణికట్టు నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి 5 వ్యాయామాలు

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.