నాణ్యత లేని ఆహారం .. ప్రజల ప్రాణాలతో చెలగాటం !! ఈ హోటల్స్ పై కఠిన చర్యలు? నిత్యం రద్దీగా ఉండే సికింద్రాబాద్, బేగంపేట్, జిహెచ్ఎంసి సర్కిల్ లో హోటల్స్ తినే ఆహారం విషయంలో దారుణంగా వ్యవహరిస్తున్నారు.కల్తీ జరుగుతున్నా ఫుడ్ అఫీసర్స్ ఉదాసీన వైఖరి ఏంటో జనాలకు అంతుచిక్కడం లేదు. ఇప్పటికైనా ఆయా హోటల్స్ పై చర్యలు తీసుకోవాలని బాధిత ప్రజలు అంటున్నారు. By Nedunuri Srinivas 20 Jan 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి HOTELS IN SEC- BAD: నిత్యం వచ్చిపోయే ప్రయాణీకులతో రద్దీగా ఉండే సికింద్రాబాద్, బేగంపేట్ జిహెచ్ఎంసి సర్కిల్ లో పనుల నిమిత్తం ఇతర ప్రాంతాల నుండి వచ్చి వెళ్ళేవారు చాలా ఎక్కువ..ఇదే అదునుగా చేసుకొని హోటల్స్ యజమానులు తినే ఆహార విషయంలోకనీస నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈ ఆహారం తిన్న వారు ఖచ్చితంగా హాస్పిటల్ పాలవడం జరుగుతోంది ఇంత కల్తీ జరుగుతున్నా ఫుడ్ అఫీసర్స్ ఉదాసీన వైఖరి ఏంటో జనాలకు అంతుచిక్కడం లేదు. తిన్న తరువాత కడుపు మంట ఇక .సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి నిత్యం వేలాది సంఖ్యలో ప్రయాణికులు వస్తూ పోతుంటారు.సమయం తక్కువ ఉండడంతో ఏదో ఒక హోటల్లో తిని వెళ్ళటానికి ప్రయత్నించే జనాలకు తిన్న తరువాత కడుపు మంటతో కచ్చితంగా ఆసుపత్రికి చేరాల్సిందే అని అంటున్నారు. ఈ హోటల్స్ లో కిచెన్స్ లోపల చెత్తకుప్పను తలపిస్తాయి ఇలాంటి హోటళ్ల పై ప్రభుత్వ అధికారులు ఎందుకు తనిఖీలు చేయడం లేదని సూటిగా ప్రశ్నిస్తున్నారు ప్రజలు. ఏ హోటల్ కిచెన్ లో చూసిన అపరిశుభ్ర వాతావరణం, కుళ్లిపోయిన మాంసం , పేరు ఊరులేని నూనెల తో కనీసం నాణ్యత లేని వంట సరుకులతో ఓ చెత్త కుప్పను తలపిస్తాయి.బయట మాత్రం గుమగుమలాడే బిర్యానీ అని పెద్ద పెద్ద బోర్డులు పెట్టి, వచ్చే పోయే ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి సికింద్రాబాద్ హోటల్స్. కఠిన చర్యలు తీసుకోవాలి ఇప్పటికైనా సంబంధించిన ఫుడ్ ఫుడ్ ఆఫీసర్లు ఆయా హోటల్స్లో ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి, నాణ్యత పాటించని హోటల్స్ పై కఠిన చర్య తీసుకుంటే తప్ప హోటల్ యజమానుల తీరు మారదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తనిఖీలు తూతూ మంత్రం ఇటీవలే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరలో ఓ పేరు మోసిన హోటల్ ను ఫుఫ్ అఫీషర్స్ సీజ్ చేసిన విషయం అందరికి తెలిసిందే.కొన్నాళ్ళకు మళ్ళి మామూలే. తూతూ మంత్రంగా తనిఖీలు చేసి వండిన ఫుడ్ ను ల్యాబ్ పంపిస్తున్నామని చెప్పి చేతులు దులుపేసుకుంటున్నారని సంబంధించిన అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు.. అయినా సరే .. ఆ చుట్టుపక్కల ఉన్నవారు ఇలాంటి ఫుడ్ దందా మానటం లేదు జనాలు వస్తూ ఉంటారు. తినేవాళ్ళు తింటూనే ఉంటారు. కానీ ఒక్కసారి ఆయా హోటల్స్ కి వెళ్లి తిన్నవారు మాత్రం మళ్ళీ ఆ హోటల్స్ వైపే కన్నెత్తి చూడరు. ALSO READ:చిన్న పిల్లలో కిడ్నీ వ్యాధులు రావడానికి కారణాలు .. ఎలా గుర్తించాలి ? #food-inspection #food-poisoning #shuts-down #ghmc మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి