Poonch Terrorist Attack : ఆర్మీ వాహనాలపై ముష్కరుల కాల్పులు..తిప్పి కొట్టిన జవాన్లు..!!

జమ్మూకశ్మీర్ లో ముష్కరులు మరోసారి రెచ్చిపోయారు. పూంఛ్ జిల్లాలో సైనిక వాహనాలపై దాడికి పాల్పడ్డారు. అప్రమత్తమైన జవాన్లు దాడుల్ని తిప్పికొట్టారు. పరస్పర కాల్పుల్లో ఎంతమందికి గాయాలయ్యాయన్న విషయం తెలియరాలేదు.

New Update
Poonch Terrorist Attack : ఆర్మీ వాహనాలపై ముష్కరుల కాల్పులు..తిప్పి కొట్టిన జవాన్లు..!!

Terrorist Attack :  జమ్మూ కాశ్మీర్‌(Jammu & Kashmir) లోని పూంచ్ జిల్లా ఖనేతర్‌లో ఈ సాయంత్రం ఆర్మీ(Army) వాహనంపై ఉగ్రవాదులు కాల్పులు(Terrorist Attack) జరిపారు. ముష్కరుల దాడిని జవాన్లు తిప్పికొట్టారు ఈ ఘటన తర్వాత సైన్యం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. ప్రస్తుతం దీని పూర్తి సమాచారం అందాల్సి ఉంది. ఇంకా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రస్తుతం ఇరు వర్గాల మధ్య కాల్పులు జరుగుతున్నట్లు సమాచారం. గత ఏడాది డిసెంబర్‌లో కూడా ఉగ్రవాదులు ఆర్మీ వాహనంపై దాడి చేశారని, అందులో నలుగురు సైనికులు అమరులయ్యారని, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. . ఆర్మీ వాహనంపై దాడి చేసేందుకు ఉగ్రవాదులు అడవుల్లో దాక్కున్నారు. ఆ ఘటన మరువకముందే మరో ఘాతుకానికి ఒడిగట్టారు. మూడు వారాల వ్యవధిలోనే ఇది రెండో ఘటన.

ఈ సంఘటన తర్వాత, సైన్యం మొత్తం ప్రాంతాన్ని చుట్టుముట్టింది. మండి నుండి పూంచ్ మార్గంలో వాహనాల రాకపోకలను నిలిపివేసింది. ఉగ్రవాదుల కోసం వెతకడానికి భారీ ఆపరేషన్ ప్రారంభించింది. సరిహద్దు జిల్లాలైన రాజౌరి, పూంచ్ జిల్లాల్లో ఉగ్రవాదులు ఇలాంటి చర్యలకు పాల్పడుతూనే ఉన్నారు. ఈ సంఘటనకు ముందు, నవంబర్‌లో రాజౌరీలోని బాజిమల్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఆర్మీ కెప్టెన్లు మరియు ముగ్గురు సైనికులు వీరమరణం పొందారు.

ఇది కూడా చదవండి: అయోధ్య క్రేజ్‎ను క్యాష్ చేసుకుంటున్న సైబర్ కేటుగాళ్లు…ఆ లింక్ క్లిక్ చేశారో అంతే సంగతులు..!!

Advertisment
తాజా కథనాలు