Poonam Pandey: పూనమ్‌ మరణం డ్రామాతో కంగుతిన్న జనం.. బీపీ పెంచిన నటి పోస్ట్!

తాను చనిపోలేదంటూ నటి పూనమ్‌ పాండే క్లారిటీ ఇచ్చింది. నిన్న తన టీమ్‌ పూనమ్‌ చనిపోయినట్టు పోస్టు పెట్టగా.. ఇదంతా క్యాన్సర్‌పై అవగాహన కోసమేనంటూ తాజాగా పూనమ్‌ చెప్పుకొచ్చింది. అయితే ప్రజల్ని ఫూల్‌ చేస్తావా అంటూ నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు.

New Update
Poonam Pandey: పూనమ్‌ మరణం డ్రామాతో కంగుతిన్న జనం.. బీపీ పెంచిన నటి పోస్ట్!

Poonam Pandey Fake Death: కుర్రాళ్ల గుండెల్లో తన అందాలతో సెగలు రేపే నటి పూనమ్‌ పాండే ఈ సారి మాత్రం బీపీ పెంచారు. వివాదాలకు కేరఫ్‌గా ఉండే పూనమ్‌ తాను చనిపోలేదంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో దర్శనమిచ్చారు. తాను బతికే ఉన్నానంటూ వీడియో రిలీజ్ చేశారు. నిన్న పూనమ్‌ పాండే చనిపోయిందంటూ ఇన్‌స్టాలో ఆమె టీమ్‌ పోస్ట్ చేసింది. గర్భాశయ క్యాన్సర్‌తో (Cervical Cancer) చనిపోయిందని ప్రచారం చేసింది. తన మరణం డ్రామా వెనుక కథేంటో చెప్పుకొచ్చింది టీమ్‌. గర్భాశయ క్యాన్సర్‌పై అవగాహన కల్పించడానికే ఇలా చేసినట్టు చెప్పింద. తాను చనిపోయినట్లు పోస్ట్ చేయించానని క్లారిటీ ఇచ్చింది. దీంతో పూనమ్‌ దెబ్బకి జనం మరోసారి కంగుతిన్నారు. పూనమ్‌ నిత్యం వివాదాల్లోనే నిలుస్తుంటుంది. గతంలో ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే నగ్నంగా స్టేడియాంకు వస్తానని చెప్పి పూనమ్‌ ఫేమస్ అయ్యింది. గతంలో భర్తపైనే పోలీస్‌ కేసు పెట్టింది పూనమ్.

Also Read: సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి? ఈ మహమ్మారి ఎలా సోకుతుంది?

పూనమ్ బ్రతికే ఉంది. చనిపోలేదు.. స్వయంగా ఆమె తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. నేను సర్వైకల్ కాన్సర్ తో చనిపోయానని వార్తలు వస్తున్నాయి. అవన్నీ నిజం కాదు. అలా ఎందుకు చేసామంటే.. చాలామంది మహిళలు ఈ రకమైన కాన్సర్ తో బాధపడుతూ చనిపోతున్నారు. అది నాకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది. వారికి ఈ జబ్బుపై సరైన అవగాహనా లేదు. వారికి అవగాహనా కల్పించడానికే ఇలా చేశాను. ఈ డిసీస్ ఉన్న వారు అంట త్వరగా ఏం చనిపోరు. దానికి కూడా వ్యాక్సిన్ ఉంది. కానీ అది ఉన్నట్లు కూడా చాలా మంది మహిళలకు తెలియదు. వారికి అవగాహనా కల్పించడంకోసమే ఇలా చేయాల్సి వచ్చిందని ఆమె చెప్పుకొచ్చింది. ఏది ఏమైనా పూనమ్ ఇలా చేసినందుకు, సోషల్ మీడియాలో ఆమెపై తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తున్నాయి.పబ్లిసిటీ కోసం మరీ ఇంత దిగజారాలా అంటూ ప్రశ్నిస్తున్నారు. అమె కనుక చనిపోకపోతే వెంటనే అరెస్ట్ చేయాలని నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు.

Also Read: రాజకీయ కురువృద్ధుడు..రాజనీతిజ్ఞడు ఎల్.కె. అద్వానీ

Advertisment
Advertisment
తాజా కథనాలు