/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/poonam-jpg.webp)
Poonam Pandey : బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ పూనమ్ పాండే ఇక లేరనే వార్త సోషల్ మీడియాలో ఆమె అకౌంట్ ద్వారా పెట్టిన పోస్టు కలకలం రేపింది. ఆకస్మాత్తుగా పూనమ్ పాండే చనిపోవడం ఏంటని అంతా షాక్ అయ్యారు. ఆమె ఫ్యాన్స్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కానీ ఆమె ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టడం పట్ల ఆశ్చర్యం వేసినా...కొంత అనుమాలకు మాత్రం తావిస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇదంతా ఉట్టిదే అంటున్నారు.
జనాలను మోసం చేసేందుకు ఇలా చేసిందంటున్నారు. పూనమ్ పాండే ఆకస్మాత్తుగా మరణిచండమేంటీ అనే సందేహం చాలా మదిలో మొదలైంది. ఆమెకు సంబంధించిన వ్యాధిని సెర్చ్ చేశారు. సర్వైకల్ క్యాన్సర్ తో మరణించినట్లు ఆమె అకౌంట్లో పెట్టిన పోస్టులో ఉంది. అయితే దీనిపై అవగాహన ఉన్నవాళ్లంతా ఇది జరగడం అసంభం అంటున్నారు.
సర్వైకల్ క్యాన్సర్ తో మరణించడం చాలా అరుదుగా జరుగుతుందంటున్నారు. అదే సమయంలో సడెన్ గా ఇది జరగదంటున్నారు. 50ఏళ్లలోపు ఉన్నవాళ్లు ఈ క్యాన్సర్ కు గురైతే చికిత్స ద్వారా బతికే అవకాశం ఎక్కువగా ఉంటుందంటున్నారు. ప్రస్తుతం పూనమ్ పాండే వయస్సు 32 సంవత్సరాలు. ఈమధ్యే పెళ్లి కూడా చేసుకుంది. భర్తతో గొడవలు..కొట్టుకోవడం, పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం...విడాకుల వరకు వెళ్లింది. పెళ్లైన ఏడాదికి భర్తతో విడిపోయింది.
The last video of model Poonam pandey before passing away from cervical cancer,I never watched any show but I just watched her lock up show from Pakistan,it was amazing. #PoonamPandey #PoonamPandeyDeathpic.twitter.com/FuWNM0wfqo
— King (@King_272727) February 2, 2024
అయితే ఈ క్యాన్సర్ అనేది సెక్స్ ద్వారానే ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది. ఈ క్యాన్సర్ వచ్చిన వెంటనే ప్రాణాలు పోవడం అస్సలు జరగదు. కొన్నాళ్లపాటు చికిత్స తీసుకున్న తర్వాత చివరి స్టేజీలో మాత్రమే ఇలా జరుగుతుంది. దీనికి దాదాపు 15 నుంచి 20ఏళ్లు పడుతుందని అంటున్నారు. మొన్నటివరకు పూనమ్ చాలా యాక్టివ్ గా ఉంది. సోషల్ మీడియాలో ఎన్నో పోస్టులు పెట్టింది. కానీ ఇలా ఎందుకు జరుగుతుంది ?అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
ఇది కూడా చదవండి: తమిళనాడు క్రీడా మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు కర్నాటక కోర్టు సమన్లు..!!
పూనమ్ పాండే చనిపోవడం ఫేక్ న్యూస్ అంటున్నారు. ఇదంతా పీఆర్ స్టంట్ కోసమే అంటున్నారు. నిజంగానే చనిపోతే కారణం వేరే అయి ఉంటుంది..సర్వైకల్ క్యాన్సర్ అనేది మాత్రం కాదంటున్నారు. దీనిపై విచారణ జరిపించాలంటున్నారు.
Observing the smile on her face during her final media appearance, we pay our respects. She embraced life as if each day were her last, mindful that any day could be her last. #PoonamPandey passes away from cervical cancer.
May her soul rest in peace.
pic.twitter.com/58Ao1U6iAZ— Ramsa Chaudhary (@Ramkishor_jaat_) February 2, 2024
ఒకవేళ పూనమ్ చనిపోతే జరగాల్సిన కార్యక్రమాలు గురించి ఎన్నో విషయాలు బయటకు రావాలి. కానీ ప్రైవసీ పేరుతో ఎందుకు దాచే ప్రయత్నం చేస్తున్నారనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఇదంతా పెద్ద డ్రామానే అయి ఉంటుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
You never know who suffers from what,just love everyone before he or
she leaves you like. #PoonamPandey#PoonamPandeyDeath #INDvsENGTest #HemantSoren pic.twitter.com/HLFF0Rpan0— Bijendra Yadav (@Bijendr09625518) February 2, 2024