Ponnam Prabhakar: ప్రతిపక్షాలు చెప్పినట్లు నేను ఆడిపాడను.. కౌశిక్ రెడ్డికి పొన్నం కౌంటర్!

తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులపై రాళ్లు వేసిన వాళ్లు తన గురించి మాట్లాడితే ఊరుకునేది లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. ప్రతిపక్షాలు ఆడుమంటే ఆడే, పాడుమంటే పాడే గొంతు తనది కాదంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై సెటైర్స్ వేశారు.

New Update
Ponnam Prabhakar: ప్రతిపక్షాలు చెప్పినట్లు నేను ఆడిపాడను.. కౌశిక్ రెడ్డికి పొన్నం కౌంటర్!

Ponnam Prabhakar: తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలకు తెగించి కొట్లాడిన తాను ప్రతిపక్షాలు ఆడుమంటే ఆడుతానని అనుకుంటున్నారా అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారులపై రాళ్లు వేసిన వాళ్లు తన గురించి మాట్లాడితే ఊరుకునేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసెంబ్లీ వేదికగా జరిగిన ఉద్యమం గురించి చర్చలో భాగంగా.. విద్యార్థి నాయకుడిగా, ఎంపీగా ఆనాడు పార్లమెంట్‌లో తెలంగాణ కోసం కొట్లాడానని, తన గొంతు ప్రతిపక్షాలకు నచ్చకపోతే తానేం చేయాలో చెప్పాలన్నారు పొన్నం ప్రభాకర్. ప్రతిపక్షాలు ఆడుమంటే ఆడే, పాడుమంటే పాడే గొంతు తనది కాదన్నారు. ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా ఇలాగే మాట్లాడాని, అవసరం ఉంటే ఆ రికార్డులు తెప్పించుకుని చూడాలని సూచించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు