Revanth Reddy: కేసీఆర్ కు రేవంత్ పరామర్శ అందుకే.. పొన్నాల లక్ష్మయ్య వివాదాస్పద వాట్సాప్ స్టేటస్!

సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ను పమామర్శించిన ఫొటోను వాట్సాప్ పెట్టుకున్న బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య అన్నా.. ఏడాదైనా నన్ను సీఎంగా ఉండనీయంటూ కేసీఆర్‌కు రేవంత్‌ దండం పెడుతున్నారంటూ వివాదాస్పద కామెంట్ చేశారు. దీంతో ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

Revanth Reddy: కేసీఆర్ కు రేవంత్ పరామర్శ అందుకే.. పొన్నాల లక్ష్మయ్య వివాదాస్పద వాట్సాప్ స్టేటస్!
New Update

తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డిపై బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య (Ponnala Laxmaiah) మరో సారి వార్తల్లో నిలిచారు. తాజాగా పొన్నాల లక్ష్మయ్య పెట్టిన వాట్సాప్ స్టేటస్ వివాదానికి దారితీసింది. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్ ను (KCR) సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పరామర్శించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫొటోను తన వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకున్న పొన్నాల వివాదస్పద కామెంట్‌ చేశారు. అన్నా.. ఏడాదైనా నన్ను సీఎంగా ఉండనీయంటూ కేసీఆర్‌కు రేవంత్‌ దండం పెడుతున్నారంటూ వాట్సప్‌ స్టేటస్‌ పెట్టుకున్నారు.
ఇది కూడా చదవండి: CM Revanth Reddy : అన్నా అని పిలిచింది..నేనున్నా అంటూ ఆపన్న హస్తం ఇచ్చిన రేవంత్

దీంతో ఇందుకు సంబంధించిన స్క్రీన్‌ షాట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు అనేక విధాలుగా కమెంట్ చేస్తున్నారు. కాంగ్రెస్ అభిమానులు మాత్రం పొన్నాలపై ఫైర్ అవుతున్నారు. కాంగ్రెస్ లో సుధీర్ఘకాలం ఎమ్మెల్యే, మంత్రి, టీపీసీసీ చీఫ్ తదితర హోదాల్లో పని చేసిన పొన్నాల.. ఎన్నికల ముందు గులాబీ గూటికి చేరారు.

ఆ సమయంలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి, పొన్నల లక్ష్మయ్య మధ్య మాటల తూటాలు పేలాయి. తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. ఈ నేపథ్యంలో పొన్నాల చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.

#cm-revanth-reddy #ponnala-laxmaiah
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe