Khammam Politics: పొంగులేటి, తుమ్మలకు కాంగ్రెస్ ఓపెన్ ఆఫర్.. ఖమ్మం జిల్లా పాలిటిక్స్ లో కొత్త ట్విస్ట్!

తుమ్మల నాగేశ్వర్ రావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కాంగ్రెస్ ఓపెన్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పాలేరు, ఖమ్మంలో ఎవరు పోటీ చేస్తారో మీరే తేల్చుకోండని హైకమాండ్ వీరికి చెప్పినట్లు సమాచారం. దీంతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ రోజు తుమ్మలతో సమావేశమయ్యారు.

Khammam Politics: పొంగులేటి, తుమ్మలకు కాంగ్రెస్ ఓపెన్ ఆఫర్.. ఖమ్మం జిల్లా పాలిటిక్స్ లో కొత్త ట్విస్ట్!
New Update

ఇటీవల బీఆర్ఎస్ ను (BRS Party) వీడి తమ పార్టీలో చేరిన సీనియర్ నేతలు తుమ్మల నాగేశ్వర్ రావు (Tummala Nageshwar Rao), పొంగులేటి శ్రీనివాసరెడ్డికి (Ponguleti Srinivas Reddy) కాంగ్రెస్ ఓపెన్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు నేతలు పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం (Palair Assembly constituency) నుంచే పోటీ చేయాలని ఆసక్తి చూపుతున్నారు. ఈ ఇద్దరు నేతలు కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ కేడర్ ను సమాయత్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాలేరు నియోజకవర్గంలో పొంగులేటి వర్గీయులు విస్తృతంగా పర్యటిస్తున్నారు. తుమ్మల నాగేశ్వర్ రావు పాలేరుతోనే తన రాజకీయం ముడిపడుందంటూ స్పష్టం చేస్తున్నారు. పాలేరుకు గోదావరి జలాలు పారించడమే తన లక్ష్యమని ఆయన ప్రకటిస్తున్నారు. దీంతో పొంగులేటి, తుమ్మల అభ్యర్థిత్వం ఖరారు విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.

ఇది కూడా చదవండి: Big Breaking: తెలంగాణ ఎన్నికల బరిలో షర్మిల, విజయమ్మ.. ఇతర అభ్యర్థుల లిస్ట్ ఇదే!

పోటీచేసే స్థానంపై మీరద్దరూ చర్చించుకుని ఏకాభిప్రాయం తెలపాలని సూచించినట్లు తెలుస్తోంది. అధిష్టానం సూచనతో తుమ్మలతో పొంగులేటి ఈ రోజు సమావేశమయ్యారు. అరగంటకు పైగా ఈ విషయమై వీరిద్దరు చర్చించుకున్నారు. అయితే.. పోటీచేసే స్థానంపై ఈ ఇద్దరు నేతలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. కానీ, ఈ నేతలు ఆ విషయాన్ని బయటకు ప్రకటించకపోవడం గమనార్హం. ప్రత్యర్థులను డిఫెన్స్ లోనే ఉంచడంలో భాగంగానే వారు పోటీ చేసే స్థానాలను ప్రకటించడం లేదని తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Komatireddy Venkat Reddy: కాంగ్రెస్ మేనిఫెస్టో బయటపెట్టిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. సంచలన ఇంటర్వ్యూ

రెండు నియోజకవర్గాల్లో కలిసి పని చేసేలా ఈ ఇరువురు నేతలు కార్యాచరణ రూపొందించుకున్నట్లు సమాచారం. తమ అభిప్రాయాన్ని ఇప్పటికే తుమ్మల, పొంగులేటి అధిష్టానానికి చేరవేసినట్లు వారి సన్నిహితులు చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో వీరి వ్యూహం అర్థం కాక ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారన్న టాక్ ఖమ్మం జిల్లాలో సాగుతోంది.

#khammam #thummal-nageswar-rao #congress #ponguleti-srinivasa-reddy
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe