Ponguleti srinivas: గ్రూప్-2,3 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. 'పొంగులేటి శీనన్న నిరుద్యోగ కానుక'గా ఫ్రీ కోచింగ్!

పాలేరు నియోజకవర్గ నిరుద్యోగులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుభవార్త చెప్పారు. 'పొంగులేటి శీనన్న నిరుద్యోగ కానుక' పేరిట ఉచిత కోచింగ్ క్యాంప్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆసక్తిగల వారు ఆగస్టు 9లోపు 8985096699కు వివరాలు పంపాలి.

Ponguleti srinivas: గ్రూప్-2,3 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. 'పొంగులేటి శీనన్న నిరుద్యోగ కానుక'గా ఫ్రీ కోచింగ్!
New Update

Telangana: పాలేరు నియోజకవర్గంలోని గ్రామీణ నిరుద్యోగులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అదిరిపోయే బంపర్ ఆఫర్ ఇచ్చారు. గ్రూప్-2,3 పరీక్షలతో పాటు పోలీస్ ఉద్యోగాలకు సన్నద్ధం అవుతున్న వారికి చేయుత ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తున్న రైట్ ఛాయిస్ అకాడమీ సహకారంతో 'పొంగులేటి శీనన్న నిరుద్యోగ కానుక' పేరిట ఉచిత కోచింగ్ క్యాంప్ ను ప్రారంభించనున్నట్లు తెలిపారు.

publive-image

ఈ మేరకు ఖమ్మం జిల్లా కూసుమంచిలోని క్యాంప్ కార్యాలయంలో ఇందుకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ శిక్షణా శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పాలేరు నియోజవకర్గంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారంతా.. ఆగస్ట్ 9లోపు అభ్యర్థి పేరు, గ్రామం, మండలం వివరాలను 8985096699 ఫోన్ నెంబర్ కు వాట్సప్ లో పంపాలని నిర్వాహకులు తెలిపారు.

Also Read : సీయూఈటీ (యూజీ) ఫలితాలు విడుదల.. లింక్ ఇదే!

#ponguleti-srinivas #ponguleti-srinanna-nirudyoga-kaanuka
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe