/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Ponguleti-Srinivas-jpg.webp)
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కార్యాలయంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కొత్తగూడెం నియోజకవర్గం నుంచే పొంగులేటి పోటీచేయాలంటూ ఆయన అభిమాని ఒకరు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పొంగులేటి అనుచరులు అతడ్ని అడ్డుకున్నారు. ఆ తర్వాత పొంగులేటి వద్దకు తీసుకెళ్లారు. అయితే ఇటీవల పాలేరు నియోజరవర్గం నుంచి పొంగులేటి శ్రీనివాస్ పోటీ చేయనున్నారని జోరుగా ప్రచారం జరిగింది. దీంతో కొత్తగూడెంలో ఉన్నటువంటి పొంగులేటి అనుచరులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన కొత్తగూడెం నుంచి పోటీ చేయాలని కోరుతూ ఒకరు ఆత్మహత్యాయత్నం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో పొంగులేటి ఎక్కడి నుంచి పోటీ చేస్తారో అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. పొంగులేటి ఎక్కడి నుంచి పోటీ చేస్తోరో అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆఫీస్ ముందు పొంగులేటి అభిమాని ఆత్మహత్యాయత్నం
పొంగులేటి కొత్తగూడెం నుండి పోటీ చేయాలని ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన పొంగులేటి అభిమాని. pic.twitter.com/J6SzvhVyzg
— Telugu Scribe (@TeluguScribe) October 15, 2023