Telangana : రాష్ట్రంలో నేటి నుంచి పాలిటెక్నిక్‌ వెబ్‌ కౌన్సెలింగ్‌

తెలంగాణలో నేటి నుంచి పాలిసెట్‌ మొదటి విడత వెబ్‌ కౌన్సిలింగ్‌ ప్రారంభం కానుంది.విద్యార్థులు ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించి, స్లాట్‌ బుక్‌ చేసుకోవాలని అధికారులు తెలిపారు. 22 నుంచి 25 వరకు సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌, 22 నుంచి 27వరకు వెబ్‌ఆప్షన్ల ఎంపిక, ఈ నెల 30లోపు సీట్లను కేటాయిస్తారు.

New Update
Telangana : రాష్ట్రంలో నేటి నుంచి పాలిటెక్నిక్‌ వెబ్‌ కౌన్సెలింగ్‌

Polytechnic Web Counseling  : తెలంగాణ (Telangana) లో నేటి నుంచి పాలిసెట్‌ మొదటి విడత వెబ్‌ కౌన్సిలింగ్‌ ప్రారంభం కానుంది. దీంతో విద్యార్థులు ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించి, స్లాట్‌ బుక్‌ చేసుకోవాలని అధికారులు తెలిపారు. ఈ నెల 22 నుంచి 25 వరకు సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌, 22 నుంచి 27 వరకు వెబ్‌ ఆప్షన్ల ఎంపిక, ఈ నెల 30లోపు సీట్లను విద్యార్థులకు కేటాయిస్తారు.

పాలిటెక్నిక్‌ కోర్సు (Polytechnic Course) ల్లో గతేడాదితో పోల్చితే ఈ ఏడాది 1,122 సీట్లు అదనంగా చేరాయి. గతేడాది 25,290 సీట్లుండగా, ఈ ఏడాది 26,412కు చేరింది. 115 కాలేజీల్లో (అందులో 58 ప్రైవేట్‌, 57 ప్రభుత్వ కాలేజీలు ఉన్నాయి) 26వేలకు పైగా సీట్లకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (AICTE) ఇటీవలే అనుమతి ఇచ్చింది. ఈ సీట్లను కన్వీనర్‌ కోటాలో వెబ్‌కౌన్సెలింగ్‌ ద్వారా పూర్తి చేస్తారు.

Also read: మొదటి రోజే 10 గంటల పాటు సమీక్ష..అధికారుల టార్గెట్ మూడు నెలలే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు