AP POLYCET: ముగిసిన పాలిసెట్‌.. ఫలితాలు ఎప్పుడంటే

పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏపీలో శనివారం నిర్వహించిన పాలిసెట్ పరీక్షకు 88.74 శాతం విద్యార్థులు హాజరయ్యారు. పాలిసెట్ ప్రాథమిక 'కీ'ని ఏప్రిల్ 30న విడుదల చేస్తామని, ఫలితాలను మే 10లోపు విడుదల చేస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు.

New Update
AP POLYCET: ముగిసిన పాలిసెట్‌.. ఫలితాలు ఎప్పుడంటే

AP POLYCET 2024: పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏపీలో శనివారం నిర్వహించిన పాలిసెట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్షకు 88.74 శాతం విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 1,59,989 మంది దరఖాస్తు చేసుకోగా.. 1,41,978 మంది పరీక్ష రాసినట్లు ఓ ప్రకటనలో సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ చదలవాడ నాగరాణి వెల్లడించారు. ఇక పాలిసెట్ ప్రాథమిక 'కీ'ని ఏప్రిల్ 30న విడుదల చేస్తామని తెలిపారు. ఫలితాలను మే 10లోపు విడుదల చేస్తామని చెప్పారు. జూన్ మొదటి వారంలో విద్యా సంవత్సరాన్ని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Official Website: https://polycetap.nic.in/Default.aspx

Also Read: వైసీపీ మేనిఫెస్టోపై చంద్రబాబు సెటైర్లు

Advertisment
తాజా కథనాలు