మరికొన్ని రోజుల్లో తెలంగాణ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఓ నోటిఫికేషన్ ను జారీ చేసింది. దాని ప్రకారం తెలంగాణలో సమస్యాతక్మంగా ఉన్న 13 నియోజకవర్గాల్లో పోలింగ్‌ను సాయంత్రం నాలిగింటి వరకే నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. సిర్పూర్, చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి,ములుగు, పినపాక, ఇల్లెందు, కొత్తగూడెం, ఆశ్వారావుపేట, భద్రాచలం ఉన్నాయి. ఇక్కడ సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ నిర్వహిస్తారు. ఇవి కాక తెలంగాణలోని మిగిలిన 106 స్థానాల్లో మాత్రం ఉదయం ఏడు నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.
Also read:నేడు కాంగ్రెస్ లోకి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి
తెలంగాణ ఎన్నికలు నవంబర్ 30న జరగనున్నాయి. 3న నోటిఫికేషన్ విడుదల అవనుంది. నవంబర్ 10వరకు నామినేషన్లకు, 15 వరకూ ఉపసంహరణకు తుది గడువులుగా నిర్ణయించారు. మరోవైపు తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లపై ఈసీఐ ఆరా తీసింది. వీడియో కాన్ఫరెన్స్ లో వికాస్ రాజ్, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలు హాజరయ్యారు. ఎమ్సీసీ, సీజింగ్ మీద రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఎన్నికల సంఘం సూచనలు చేసింది. అలాగే రాష్ట్రంలో సెంట్రల్ కమిటీ... పర్యటనలో చేసిన ఆదేశాల అమలుపై రాష్ట్ర అధికారులను అడిగి తెలుసుకుంది. దాంతో పాటూ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్ల మీద ఈసీఐకు సీఈవో వికాస్ రాజ్ వివరించారు.