PM Modi: ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు.. ఎప్పుడంటే
మూడోసారి ప్రధాని పీఠం ఎక్కబోతున్న నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం ఖరారయ్యింది. జూన్ 9న ఆదివారం సాయంత్రం ఆయన ఢిల్లీలోలోని ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
మూడోసారి ప్రధాని పీఠం ఎక్కబోతున్న నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం ఖరారయ్యింది. జూన్ 9న ఆదివారం సాయంత్రం ఆయన ఢిల్లీలోలోని ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. ఏపీలో కూటమి గెలిచిన తర్వాత రేవంత్ మొదటిసారిగా ఫోన్ చేసి.. చంద్రబాబుకు అభినందనలు తెలియజేశారు. రెండు రాష్ట్రాల విభజన హామీలు, సమస్యలు పరిష్కరించుకోందామని కోరారు.
ఈ నెల 11న టీడీపీ ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో టీడీఎల్పీ నేతగా చంద్రబాబును ఎన్నుకోనున్నారు. అనంతరం ఈ నెల 12న చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి. బాబు ప్రమాణ స్వీకారానికి మోదీతో పాటు బీజేపీ అగ్రనేతలు హాజరయ్యే అవకాశం ఉంది.
టీడీపీ నాయకులు ప్రత్యేక హోదా, పోలవరం తదితర అంశాలపై దృష్టి పెట్టకుండా అప్పుడే వైసీపీ నాయకులపై దాడులు చేస్తున్నారన్నారు వైసీపీ నేత గోరంట్ల మాధవ్. తమ ఓటమికి కారణాలు ఏంటో ప్రక్షాళన చేసుకుంటామన్నారు. ప్రజల్లోనే ఉంటూ ప్రజల సమస్యలపై పోరాడుతాడని కామెంట్స్ చేశారు.
చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. ఏపీలో కూటమి ఘన విజయం సాధించడంతో ముఖ్యమంత్రి పదవి చేపట్టబోతున్న చంద్రబాబుకు రేవంత్ శుభాకాంక్షలు తెలిపారు. ఇరు రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కరించుకుందామని చంద్రబాబుతో రేవంత్ అన్నట్లు తెలుస్తోంది.
బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తుందని.. కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలు చేసిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల్లో 47 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో బీజేపీకి ఎక్కువగా ఓట్లు వచ్చాయని.. ఆరు నెలల్లో కాంగ్రెస్‌పై ప్రజా వ్యతిరేకత ప్రారంభమైందన్నారు.
ఏపీలో టీచర్ల బదిలీలకు బ్రేక్ పడింది. ఎన్నికల ముందు దాదాపు 1400 మంది ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ఇచ్చిన ఉత్తర్వులు నిలుపుదల చేయాలని డీఈఓలకు విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఈ ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లనున్నారు. సీఎస్ సెలవుపై వెళ్లగానే కొత్త సీఎస్ నియామకం ఉంటుందని తెలుస్తోంది. అయితే కొత్త సీఎస్ గా సీనియర్ ఐఏఎస్ అధికారి విజయానంద్ ను ఈ రోజు సాయంత్రం గవర్నర్ నియమించనున్నట్లు తెలుస్తోంది.
వైఎస్ షర్మిలపై ఏపీ కాంగ్రెస్ నేతలు తిరుగుబాటు చేస్తున్నారు. షర్మిల అరాచకాలు పెరిగిపోయాయని సుంకర పద్మశ్రీ ఆరోపిస్తున్నారు. నచ్చిన వాళ్లకు టికెట్లు ఇచ్చారని.. అభ్యర్థుల దగ్గర డబ్బులు వసూలు చేశారని పేర్కొన్నారు. షర్మిల వ్యవహారంపై ఢిల్లీలో తేల్చుకుంటామన్నారు.