Karnataka: పోక్సో కేసులో యడ్యూరప్పకు నోటీసులు
కర్ణాటక మాజీ ముఖ్యంత్రి యడ్యూరప్పకు పోక్సో కేసు విచారణలో భాగంగా సీఐడీ నోటీసులు జారీ చేసింది. 17ఏళ్ళ బాలిక మీద ఆయన లైంగిక దాడికి పాల్పడినట్లు ఆయన మీద ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం యడ్యూరప్ప ఢిల్లీలో ఉన్నారు.
కర్ణాటక మాజీ ముఖ్యంత్రి యడ్యూరప్పకు పోక్సో కేసు విచారణలో భాగంగా సీఐడీ నోటీసులు జారీ చేసింది. 17ఏళ్ళ బాలిక మీద ఆయన లైంగిక దాడికి పాల్పడినట్లు ఆయన మీద ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం యడ్యూరప్ప ఢిల్లీలో ఉన్నారు.
యాదాద్రి లక్ష్మినరసింహ ఆలయంలో భక్తలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య అధికారును ఆదేశించారు. ఈ మేరకు ఆలయ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.
హైదరాబాద్లోని పాతబస్తీ పురానీ హవేలీలో ఎస్కే అనే ఫుట్వేర్ షాపులో బుధవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకంది. ఆ షాపులో ఉన్న చెప్పులు, మూడిసరుకు పూర్తిగా దగ్ధమయ్యాయి. దీంతో సుమారు రూ.50 లక్షల ఆస్తి నష్టం జరిగింది.
అరుణచల్ప్రదేశ్లో బీజేపీ నేత పేమ ఖండూ మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. గురువారం ఉదయం ఆయన సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విద్యార్థులకు దుస్తులు, పుస్తకాలు పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమైన రోజే పిల్లలకు దుస్తులు, పుస్తకాలు పంపిణీ చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.
కువైట్లోని ఓ భవనంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 41 మంది మృతి చెందగా.. అందులో 40 మంది భారతీయులే ఉండటం కలకలం రేపుతోంది. బుధవారం ఉదయం 6 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
ఈ రోజు కేసరపల్లిలో జరిగిన చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబు కుటుంబ సభ్యులు, ప్రధానితో కలిసి దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సీఎంగా ప్రమాణ స్వీకారం అనంతరం చంద్రబాబునాయుడు ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రులతో సమావేశం అయ్యారు. ప్రభుత్వ లక్ష్యాలను ఈ సందర్భంగా చంద్రబాబు వారికి వివరించారు. మరికొద్ది సేపట్లో మంత్రులకు శాఖలను కేటాయించే అవకాశం ఉంది.
మంత్రి పదవి దక్కడంపై గొట్టిపాటి రవికుమార్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలకు సంక్షేమం అందించడమే కాకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. వైసీపీ చేసిన తప్పులను తాము చేయమని.. గెలిపించిన ప్రజలకు మంచి పరిపాలన అందిస్తామని తెలిపారు.