BREAKING: లోక్ సభ సోమవారానికి వాయిదా
లోక్ సభ సోమవారానికి వాయిదా పడింది. నీట్ పేపర్ లీక్ అంశంపై చర్చించాలంటూ విపక్షాల ఆందోనళ నడుమ సభను వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా. జులై 1న ఉదయం 11 గంటలకు సభ తిరిగి ప్రారంభం కానుంది.
లోక్ సభ సోమవారానికి వాయిదా పడింది. నీట్ పేపర్ లీక్ అంశంపై చర్చించాలంటూ విపక్షాల ఆందోనళ నడుమ సభను వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా. జులై 1న ఉదయం 11 గంటలకు సభ తిరిగి ప్రారంభం కానుంది.
భూ కుంభకోణం కేసులో అరెస్టైన జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో అరెస్టయిన సోరెన్‌కు 5 నెలల తర్వాత బెయిల్ మంజూరైంది. జనవరి 31, 2024 రాత్రి ఈడీ ఆయన్ను అరెస్టు చేసింది.
కొండగట్టుకు ఆంజనేయ స్వామిని దర్శించుకునేందుకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శనివారం రానున్నారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని తన మొక్కులు తీర్చుకునేందుకు పవన్ కొండగట్టుకు రాబోతున్నారు.
లోక్‌సభలో గందరగోళం నెలకొంది. నీట్ పేపర్ లీకుపై తక్షణమే చర్చ జరగాలని విపక్షాలు పట్టుబట్టడంతో సభలో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో సభను మధ్యాహ్నం 12గంటలకు వాయిదా వేశారు స్పీకర్ ఓంబిర్లా.
లోక్ సభలో నీట్ పేపర్ లీక్ అంశంపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు రాహుల్ గాంధీ. ఇది లక్షల మంది యువత భవిష్యత్‌పై ఆధారపడి ఉందని అన్నారు. ప్రధాని మోదీ కూడా చర్చలో పాల్గొనాలని కోరారు. కాగా పేపర్ లీక్‌పై సభలో చర్చ జరగాలని కాంగ్రెస్ ఎంపీలు వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
దేశ రాజకీయాల్లో తెలుగు వారి హుందాతనాన్ని పరిచయం చేసిన వ్యక్తి పీవీ నరసింహరావు. దేశ రాజకీయాల్లో ఎవరూ ఊహించని సంస్కరణలు చేపట్టి దారి తప్పిన దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన చాణక్యుడు.బహుభాషా కోవిదుడు.
పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీలక ప్రకటన చేశారు. కొత్త నేర చట్టాలు జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. నేటికీ బ్రిటీష్ కాలం నాటి శిక్షా స్మృతులే అమల్లో ఉన్నాయని గుర్తు చేశారు. వాటిని సంస్కరించడం గొప్ప విషయమని చెప్పారు
ఏపీ కేడర్ కు చెందిన ఐపీఎస్ అధికారి మహేష్ చంద్ర లడ్హా ను తిరిగి రాష్ట్రానికి పంపించాలని ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రాన్ని ప్రత్యేకంగా కోరారు. ఈ రిక్వెస్ట్ గురించి కేంద్రం సానుకూలంగా స్పందించింది. మహేష్ చంద్ర లడ్హాను ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఏపీ ప్రభుత్వం నియమించనుంది.