/rtv/media/media_files/2025/12/11/grampanchayat-2025-12-11-18-20-49.jpg)
TG News: తెలంగాణ సర్పంచ్ ఎన్నికల్లో బిగ్ ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ఓ చోట ఫలితాలు టై కావడంతో టాస్ వేశారు. మరోచోట లక్కీ డ్రాతో సర్పంచ్‌ని ఎన్నుకున్నారు. మరోచోట మొదటి రెండు రౌండ్లు ఫలితాలు తారుమారు కాగా.. మూడోసారి లెక్కింపు మొదలుపెట్టడం చర్చనీయాంశమైంది. ఈ మేరకు ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం బద్యాతండాలో ఓట్ల లెక్కింపులో గందరగోళం నెలకొంది. మొదటగా 1 ఓటు తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించారు. రెండోసారి ఓట్లు లెక్కించి 3 ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి గెలిపించినట్లు ప్రకటించారు. దీంతో ఇరు పక్షాలు ఆందోళలనకు దిగడంతో.. మూడోసారి అధికారులు ఓట్ల లెక్కింపు చేపట్టారు. దీంతో ఎవరు గెలుస్తారో అని పోటీదారులతో పాటు ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
జగిత్యాలలో ఫలితాలు టై..
పలు చోట్ల ఫలితాలు టై అయ్యాయి. దీంతో అధికారులు లక్కీ డ్రా ద్వారా సర్పంచ్ అభ్యర్థిని ఎన్నుకోవడం చర్చనీయాంశమైంది. ఈ మేరకు జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం చిన్నమెట్‌పల్లిలో 4వ వార్డుకు ఇద్దరు అభ్యర్థులకు సమాన ఓట్లు పడ్డాయి. దీంతో టాస్ వేయగా వెలమల తిరుపతి గెలుపొందారు.
యాదాద్రిలో లక్కీ డ్రా..
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం లక్ష్మక్కపల్లి గ్రామంలో BRS, కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులకు ఓట్లు సమానంగా పోలయ్యాయి. BRS బలపరిచిన అభ్యర్థి ఇండ్ల రాజయ్యకు 148 ఓట్లు రాగా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి వేముల సురేందర్ రెడ్డికి సైతం 148 ఓట్లు వచ్చాయి. దీంతో అధికారులు లక్కీ డ్రా తీయగా BRS అభ్యర్థి ఇండ్ల రాజయ్య గెలుపొందారు. BRS నేతలు హర్షం వ్యక్తం చేశారు.
ఆధిక్యంలో కాంగ్రెస్ ..
ఇక జిల్లాల వారిగా నమోదైన పోలింగ్ శాతాల వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం: 86.95, సంగారెడ్డి: 84.71, పెద్దపల్లి: 82.27, భూపాలపల్లి: 82.26, నల్లగొండ: 81.63, హనుమకొండ: 81.39, రాజన్న సిరిసిల్ల: 78.58, జనగామ: 78.57, ఆసిఫాబాద్: 77.07 శాతం పోలింగ్ నమోదైనట్లు ఈ తొలి విడతలో మొత్తం 4,236 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా అందులో 395 సర్పంచ్ పదవులు ఏకగ్రీవం అయ్యాయి. ఇవాళ మొత్తం 3,834 గ్రామ పంచాయతీలకు పోలింగ్ నిర్వహించారు. ఇప్పటివరకు కాంగ్రెస్ 688, బీఆర్ఎస్ 253, బీజేపీ 38, ఇతరులు 94 మంది తెలుపొందారు.
Follow Us