/rtv/media/media_files/2025/12/11/3953emb5lhaa7eplefruroi90txafgtt-2025-12-11-20-01-53.jpg)
TG News: సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి తట్టుకోలేక ఓ అభ్యర్థి దారుణానికి పాల్పడింది. ఎన్నికలకు ముందు గెలుపు ధీమాతో గ్రామంలో సవాల్లు విసిరిన మహిళా అభ్యర్థి.. అనూహ్యంగా ఓటమిపాలవడంతో అవమానం తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా కొండగల్ మండలం ఖాజాహైమద్‌పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఈ మేరకు లక్ష్మి అనే అభ్యర్థి సర్పంచి ఎన్నికల ఫలితాల్లో ఓడిపోగా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం లక్ష్మి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
రికార్డ్ స్థాయిలో పోలింగ్..
ఇదిలా ఉంటే.. తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం నమోదు అయింది. ఇవాళ జరిగిన మొదటి విడత ఎన్నికల్లో 84.28 శాతం పోలింగ్ నమోదు అయినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. అత్యధిక పోలింగ్ యాదాద్రి భువనగిరి జిల్లాల్లో 92.88 శాతం నమోదు కాగా అత్యల్పంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 71.79 శాతం ఓట్లు పోలయ్యాయి. మొదటి విడతలో భాగంగా 3,834 సర్పంచ్, 27,628 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 37,562 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు.
Follow Us