/rtv/media/media_files/2025/12/11/rere-2025-12-11-17-54-50.jpg)
రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ విజయవంతంగా ముగిసింది. ఫలితాలు వెలువడుతున్నాయి. మొత్తం 3,834 సర్పంచ్, 27, 628 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరిగాయి. అయితే జిల్లాల వారిగా మేరకు నమోదైన పోలింగ్ శాతాల వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం: 86.95, సంగారెడ్డి: 84.71, పెద్దపల్లి: 82.27, భూపాలపల్లి: 82.26, నల్లగొండ: 81.63, హనుమకొండ: 81.39, రాజన్న సిరిసిల్ల: 78.58, జనగామ: 78.57, ఆసిఫాబాద్: 77.07 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా!
తెలంగాణ గ్రామ పంచాయతీ మొదటి విడతఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన 568 మంది సర్పంచ్ అభ్యర్థులు గెలుపొందారు. బీఆర్ఎస్ బలపరిచిన 190 అభ్యర్థులు మంది విజయం సాధించారు. బీజేపీ నుంచి 28 మంది, ఇతరులు 81 మంది మంది అభ్యర్థులు సర్పంచ్‌లుగా గెలుపొందారు. పలు గ్రామాల్లో ఇంకా లెక్కింపు కొనసాగుతోంది.
ఫలితాలు టై.. జగిత్యాల, యాదాద్రిలో లక్కీ డ్రా!
తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో పలు చోట్ల ఫలితాలు టై అయ్యాయి. దీంతో అధికారులు లక్కీ డ్రా ద్వారా సర్పంచ్ అభ్యర్థిని ఎన్నుకోవడం చర్చనీయాంశమైంది. ఈ మేరకు జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం చిన్నమెట్‌పల్లిలో 4వ వార్డుకు ఇద్దరు అభ్యర్థులకు సమాన ఓట్లు పడ్డాయి. దీంతో టాస్ వేయగా వెలమల తిరుపతి గెలుపొందారు. అలాగే యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం లక్ష్మక్కపల్లి గ్రామంలో BRS, కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులకు ఓట్లు సమానంగా పోలయ్యాయి. BRS బలపరిచిన అభ్యర్థి ఇండ్ల రాజయ్యకు 148 ఓట్లు రాగా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి వేముల సురేందర్ రెడ్డికి సైతం 148 ఓట్లు వచ్చాయి. దీంతో అధికారులు లక్కీ డ్రా తీయగా BRS అభ్యర్థి ఇండ్ల రాజయ్య గెలుపొందారు. BRS నేతలు హర్షం వ్యక్తం చేశారు.
ఈటల అభ్యర్థిపై బండి సంజయ్ అభ్యర్థి గెలుపు
తెలంగాణ తొలి విడత సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ బోణీ కొట్టింది. కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండలంలో బీజేపీ విజయం సాధించింది. బండి సంజయ్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి ర్యాకం శ్రీనివాస్ 90 ఓట్లతో విజయం సాధించారు. ప్రస్తుతం ర్యాకం శ్రీనివాస్ కమలాపూర్ బీజేపీ మండల అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇక్కడ ఈటల రాజేందర్ మరో అభ్యర్థి(ర్యాకం సంపత్) పోటీలో పెట్టగా ఓటమి పాలయ్యారు. ఉప్పలపల్లిలో మూడు, నాలుగు స్థానాలకే బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు పరిమితం కావడం గమనార్హం. భీమదేవరపల్లి మండలం రసూల్ పురాలో బీజేపీ బలపర్చిన అభ్యర్థి మహేశ్ విజయం సాధించారు.
ఉమ్మడి వరంగల్ పోలింగ్ శాతం
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 81.2% శాతం పోలింగ్ నమోదైంది. ములుగు జిల్లాలో 73.57%, హనుమకొండ జిల్లాలో 81.39 %, జనగామ జిల్లా 78.57శాతం, మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లా : 82.26 శాతం ఓటింగ్ నమోదైంది. ఇక మొదటి విడతలో 3,834 సర్పంచి, 27,628 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 37,562 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. సర్పంచి ఎన్నికల ఫలితాలు ప్రకటించిన అనంతరం వార్డు సభ్యులతో సమావేశాలు నిర్వహించి ఉప సర్పంచి ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
Follow Us