Kaushik Vs Arekapudi : రా బే చూసుకుందాం.. కోవర్టు లం..కొ..కా!

తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తన అనుచరులతో కౌశిక్‌రెడ్డి ఇంటికి వచ్చి టమాటలు, కోడిగుడ్లతో దాడి చేశారు. దీంతో 'రా.. బే రా.. చూసుకుందాం' అంటూ కౌశిక్ రెడ్డి తొడకొట్టి సవాల్ విసిరారు.

author-image
By srinivas
New Update
arikepudi

Kaushik Vs Arikepudi : తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, కౌశిక్‌రెడ్డి మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు ముదిరాయి. పాడి కౌశిక్‌ రెడ్డి ఇంటికి భారీ ర్యాలీగా వచ్చిన అరికెపూడి గాంధీ అనుచరులు కౌశిక్ రెడ్డిపై టమాటలు, కొడిగుడ్లతో దాడి చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అదుపులోకి తెచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కౌశిక్ రెడ్డి.. 'రా.. బే రా.. చూసుకుందాం. రేపు నీ ఇంటికొస్తా' అంటై అరికెపూడికి సవాల్ విసురుతూ తొడకొట్టారు. అయితే ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడిన అరికెపూడి.. కౌశిక్‌రెడ్డి తీరు వల్లే బీఆర్ఎస్ ఓటమిపాలైందంటూ సంచలన కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ లోకి వచ్చినప్పటి నుంచి కౌశిక్‌రెడ్డి తీరు సరిగా లేదు. ఆ నా లం... కొ..కు కోవర్టుగా వ్యవహరించాడు. కౌశిక్‌రెడ్డి వ్యక్తిత్వం తెలుసుకోకుండా పార్టీలో స్థానం ఇచ్చారు. ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్నాడంటూ తీవ్ర విమర్శలు చేశారు.

Also Read :  ఆడపిల్లను కిడ్నాప్‌ చేశారంటూ బెదిరింపు కాల్స్‌..జాగ్రత్త

ఇదేం ప్రజాస్వామ్యం, ఇదేం ప్రజాపాలన

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇదేం ప్రజాస్వామ్యం, ఇదేం ప్రజాపాలన, ఇదేం ఇందిరమ్మ రాజ్యం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మా పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి చేర్చుకోవడంతో పాటు, వారినే ఉసిగొల్పి బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై దాడులు చేయించడం దుర్మార్గమైన చర్య. కాంగ్రెస్ పార్టీ విద్రోహ, వికృత, అప్రజాస్వామిక వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోద్బలంతో జరిగిన దాడి ఇది. రేవంత్ రెడ్డి వెంటనే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. రాళ్లు, గుడ్లు, టమాటాలతో మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీద ఎమ్మెల్యే అరికపూడి గాంధీ మంది మార్బలంతో వెళ్లి దాడి చేయడం హేయమైన చర్య. పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగిందన్నది సుస్పష్టం. ఇంటి మీదకు వస్తామని ప్రెస్ మీట్ లో ప్రకటించి, అనుచరులతో దాడి చేసినప్పటికీ నిలువరించడంలో ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ తీవ్రంగా విఫలమైంది. పట్టపగలు ప్రజాప్రతినిధి మీద జరిగిన ఈ దాడికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. దాడి చేసిన గాంధీని, అతని అనుచరులను వెంటనే అరెస్టు చేయాలి. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి పూర్తి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.

Also Read :  పార్టీని గాడిలో పెడుతా.. RTVతో టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్!

వెయ్యి కార్లతో వెళ్తానంటూ కౌశిక్‌ రెడ్డి..

ఇదిలా ఉంటే.. అరికెపూడి ఇంటికొచ్చి బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తానన్న కౌశిక్ రెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే. 11 గంటలకు అరికెపూడి ఇంటికెళ్తానని కౌశిక్ రెడ్డి చెప్పగా… కౌశిక్ రెడ్డి తన ఇంటికి రాకుంటే తానే 12 గంటలకు అతని ఇంటికి వెళ్తానని అరికెపూడి అన్నారు. తాజాగా కౌశిక్‌ రెడ్డి ప్రెస్‌మీట్‌ పెట్టారు. కౌశిక్‌రెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. రేపు ఉదయం అరికెపూడి ఇంటికి వెయ్యి కార్లతో వెళ్తానని కౌశిక్‌ రెడ్డి చెప్పారు.

Also Read :  ఆడపిల్లను కిడ్నాప్‌ చేశారంటూ బెదిరింపు కాల్స్‌..జాగ్రత్త

అరికేపూడి గాంధీ నకిలీ గాంధీ.

కాంగ్రెస్ లో చేరానని గాంధీయే స్వయంగా మీడియాకు చెప్పి ఇపుడు మాట మారుస్తున్నారని ఫైర్ అయ్యారు కౌశిక్ రెడ్డి. పార్టీ మారిన వారు హై కోర్టు తీర్పు తర్వాత గజగజ వణుకుతున్నారని అన్నారు. స్పీకర్ నిర్ణయం దాకా ఆగకుండా పిరాయించిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉపఎన్నికలను ఎదుర్కోవాలని అన్నారు. ఎపుడు ఎన్నికలు వచ్చిన ఆ పది సీట్లు బీఆర్ఎస్ గెలుస్తుందని అన్నారు. అరికేపూడి గాంధీ నకిలీ గాంధీ అని చురకలు అంటించారు. కేసీఆర్ విడిగా కాంగ్రెస్ ఎమ్మెల్యేను చేర్చుకున్నారని నిరూపిస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అని అన్నారు. అరికేపూడి గాంధీ మా పార్టీ సభ్యుడు అయితే తెలంగాణ భవన్ కు రావాలని సవాల్ చేశారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు చీర, గాజులు గిఫ్టుగా పంపుతున్న, ఇవి వేసుకుని తిరగండి అంటూ విమర్శలు గుప్పించారు.

Also Read :  రీల్స్ పిచ్చితో రైలు పట్టాలపై కుటుంబం బలి!

Advertisment
Advertisment
తాజా కథనాలు