BJP: ‘ఉత్తరం’ కలిసొస్తుందా!.. తూర్పు నుంచి షిఫ్ట్ అయిన బీజేపీ

ప్రధాన కార్యాలయంలో వాస్తు రీత్యా మార్పుల ద్వారా పార్టీ పరిస్థితిని మెరుగుపరచాలని బీజేపీ నాయకత్వం భావిస్తోందని సమాచారం. ఆ ప్రణాళికలో భాగంగానే ఇటీవల తూర్పు ద్వారం నుంచి రాకపోకలు నిలిపేశారని తెలుస్తోంది. ఫలితాల ప్రకటన వరకూ దాన్ని మూసేసి ఉంచుతారని తెలుస్తోంది.

BJP: ‘ఉత్తరం’ కలిసొస్తుందా!.. తూర్పు నుంచి షిఫ్ట్ అయిన బీజేపీ
New Update

BJP: బీజేపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ‘దిక్కు’ల ప్రయోగం నడుస్తోందట. పార్టీ రాష్ట్ర అధినాయకత్వం ఈ ‘దిశా’నిర్దేశం చేస్తున్నట్లు తెలుస్తోంది. రాకపోకలకు సంబంధించి వాస్తు రీత్యా ప్రధాన ద్వారాలు మార్చడం ద్వారా పార్టీ పరిస్థితిని మెరుగుపరచాలని నాయకత్వం భావిస్తోందని సమాచారం. ఆ వాస్తు ప్రణాళికలో భాగంగానే ప్రధాన కార్యాలయంలో పలు మార్పులు జరిగాయని చెప్తున్నారు. అందుకే ఇటీవలే పార్టీ ప్రధాన కార్యాలయంలో తూర్పు ద్వారం నుంచి రాకపోకలు నిలిపేశారట.

ఇది కూడా చదవండి: తెలంగాణలో హంగ్.. లెక్కలతో సహా చెప్పేసిన ‘మిషన్ చాణక్య’

కొత్త నమ్మకం ప్రకారం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో తూర్పు ద్వారాన్ని బీజేపీ మూసేసింది. పోలింగ్ నుంచి ఫలితాల ప్రకటన వరకు తూర్పు ద్వారం మూసేయాలన్న రాష్ట్ర నేతల ఆదేశాల మేరకు సిబ్బంది దాన్ని క్లోజ్ చేశారు. అక్కడ రాకపోకలను ఆపేసి ఉత్తర ద్వారం నుంచే కొనసాగించాలని పార్టీ నిర్ణయించింది. ఈ వాస్తు ప్రయోగం సానుకూల ఫలితాన్నిస్తుందని పార్టీ అగ్రనేతలు ఆశిస్తున్నారని తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: తెలంగాణ ఎన్నికల పోలింగ్‌పై అమిత్ షా ఆరా

ఇప్పటికే పోలింగ్ సరళి అనుకూలంగా ఉందని బీజేపీ అగ్రనేతలు ధీమా వ్యక్తంచేస్తున్నారు. అన్నీ కలిసొస్తే ప్రభుత్వ ఏర్పాటులో కమల దళం కీలకంగా మారుతుందని వారు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. 35 సీట్ల వరకూ కచ్చితంగా బీజేపీ కచ్చితంగా గెలిచే అవకాశాలున్నాయని పలువురు అగ్రనేతలు నమ్మకంగా చెప్తున్నారు. మరి ఆ పార్టీ వాస్తు వ్యూహం ఫలించి, ఉత్తర దిశ కలిసొస్తుందేమో ఎన్నికల ఫలితాల రోజు చూడాలి.

#bjp-telangana
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe