AP Elections 2024: ఈసారి జగన్ కు 51 సీట్లు కూడా రావు.. ప్రశాంత్ కిషోర్ తో రవిప్రకాష్ సంచలన ఇంటర్వ్యూ

ఏపీలో రేపు జరగనున్న ఎన్నికల్లో వైసీపీకి 51 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్. కూటమిపై అనుకూలత కన్నా జగన్ పై వ్యతిరేకతే ఇందుకు కారణమన్నారు. ఆర్టీవీ రవిప్రకాష్ ఇంటర్వ్యూలో ఆయన అనేక సంచలన విషయాలు వెల్లడించారు.

New Update
AP Elections 2024: ఈసారి జగన్ కు 51 సీట్లు కూడా రావు.. ప్రశాంత్ కిషోర్ తో రవిప్రకాష్ సంచలన ఇంటర్వ్యూ

Political Strategist Prashant Kishor On AP Elections:  మరికొద్ది గంటల్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో అధికార వైసీపీ విజయానికి వ్యూహాలు రచించి.. అఖండ విజయానికి కారకుడుగా నిలిచిన స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ఆర్టీవీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆర్టీవీ రవిప్రకాష్ తో ఆయన ఈసారి ఎన్నికల గురించి.. ఎన్నికల్లో ఏ పార్టీకి విజయావకాశాలు ఉన్నాయి అనే విషయం అలాగే, వైసీపీ గత ఎన్నికల్లో విజయం సాధించడం వెనుక ఉన్న పరిస్థితుల గురించి సంచలన విషయాలు వెల్లడించారు.   publive-image

ఇప్పుడు జరగనున్న ఏపీ ఎన్నికల్లో   టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారం ఖాయమని ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ అంచనా వేశారు. ఆర్టీవీకి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.  గత అసెంబ్లీ ఎన్నికల్లో 151 సీట్లకు పైగా సాధించిన వైసీపీ ఈ సారి 51 సీట్లను కూడా టచ్ చేసే పరిస్థితి కూడా లేదని ఖరాఖండిగా తేల్చేశారు.  కూటమికి అనుకూలంగా కన్నా కూడా.. వైసీపీకి వ్యతిరేకంగా ఓటింగ్ ఉండబోతుందని ఆయన స్పష్టం చేశారు.

publive-image

తాను గతంలోనే అంటే సంవత్సరం క్రితమే వైసీపీ ఓటమి పాలవుతుందని చెప్పాననీ.. దానికి చాలా కారణాలు ఉన్నాయనీ ప్రశాంత్ కిషోర్ అన్నారు. వైసీపీ పథకాల వెనుక మీరే ఉన్నారని చెప్పుకుంటారు కదా.. అని రవిప్రకాష్ అడిగిన ప్రశ్నకు ప్రశాంత్ కిషోర్ చాలా వివరంగా సమాధానం చెప్పారు. "నేను ఐ-ప్యాక్ తో ఉన్నపుడు 2019లో వైసీపీకి పనిచేశాను. అప్పుడు కేవలం వైసీపీ నవ రత్నాలు స్కీమ్స్ మాత్రమే డిజైన్ చేశాను. అక్కడితో నా పని అయిపోయింది. తరువాత ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ప్రభుత్వం ఏర్పడిన తరువాత జగన్ తీసుకున్న నిర్ణయాలతో నాకు సంబంధం లేదు. సంక్షేమంతో పాటు ఉండాల్సిన అంశాలను జగన్ విడిచిపెట్టేశారు. కేవలం సంక్షేమ పథకాలనే నమ్ముకున్నారు. దానికి నేను బాధ్యుడను కాను కదా" అంటూ ప్రశాంత్ కిషోర్ వివరించారు.

publive-image

తాను ఎవరు డబ్బులు ఇస్తే వారివైపే మాట్లాడుతానని.. మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై కూడా ప్రశాంత్ కిషోర్ స్పందించారు. అలాగైతే మంత్రిగా బొత్స బాగా సంపాదించి ఉన్నారేమో.. ఆ సొమ్మును బొత్స తనకు ఇవ్వాలన్నారు. అప్పుడు తాను  ఆయనకు అనుకూలంగా మాట్లాడుతానని సెటైర్లు వేశారు. వైసీపీలో బొత్స పరిస్థితి ఏంటో తనకు తెలుసని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. జగన్ తల్లి, చెల్లి  విశ్వాసాన్నే కోల్పోయాడని చెప్పారు. 2019లో షర్మిల  అవిశ్రాంతంగా వైసీపీ విజయానికి కృషి చేసిందన్నారు. ఇప్పుడు పరిస్థితి తారుమారు అయింది. వాళ్లే వ్యతిరేకం అయినపుడు నేను వ్యతిరేకం కాలేనా? అని ప్రశ్నించారు. వాళ్లకు ఎవరైనా డబ్బులు ఇస్తే వ్యతిరేకంగా మాట్లాడారా? అలా అని బొత్సా చెప్పగలడా అని నిలదీశారు.  ప్రశాంత్ కిషోర్ పూర్తి ఇంటర్వ్యూ లైవ్ లో ఈ కింది వీడియోలో చూడండి:

Advertisment
తాజా కథనాలు