Abhilash : కరీంగనర్(Karimnagar) పాలిటెక్నిక్ విద్యార్థి(Polytechnic Student) అభిలాష్ మృతి పై ఇంకా మిస్టరీ వీడలేదు. ఎట్టకేలకు బాడీ దొరికిన బావిలోనే విద్యార్థి తలను కూడా గుర్తించారు. అయితే కేవలం పుర్రె మాత్రమే లభ్యమవటం తో సంఘటనా స్థలంలోనే వైద్యులు పుర్రెకు పోస్ట్ మార్టం నిర్వహించారు. అయితే డిప్లొమా విద్యార్ధి అభిలాష్ మృతదేహం వ్యవసాయ బావిలో లభ్యమవటం, కేవలం మొండెం మాత్రమే లభించి తల దొరక్కపోవడంతో ఈ కేసుకు సంబంధించి పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి.
దీనికి తోడు కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విద్యార్ధి తల్లిదండ్రులు(Parents), బీసీ సంఘాలు, పేరెంట్స్ కమిటీ ప్రతినిధులు ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేయడంతో పాటు కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం తోనే తం కొడుకు చనిపోయాడని అభిలాష్ తండ్రి ఫిర్యాదు చేయడం, మంత్రి శ్రీధర్ బాబు(Sreedhar Babu) ఈ విషయం లో స్పందించడం తో పోలీసులు అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేయడం తో పాటు వ్యవసాయ బావిలో నీటిని పూర్తిగా తోడించడం తో మంగళవారం అభిలాష్ పుర్రె లభ్యమైంది.
అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాతే అభిలాష్ ది హత్యా..? లేదా మరేమైనా జరిగి ఉంటుందా..? అనేది స్పష్టమవుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
Also read: వేగంగా విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ.. అక్కడ చికెన్ బంద్!