Pulse Polio : నేటి నుంచి పల్స్ పోలియో వ్యాక్సిన్ డ్రైవ్!

పోలియో నుంచి పిల్లలను కాపాడేందుకు నేడు దేశవ్యాప్తంగా పల్స్‌ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నాయి ప్రభుత్వాలు. ఐదేండ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయనున్నారు. హెల్త్‌ సెంటర్లు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, లైబ్రరీలు, బస్టాండ్లు తదితర ప్రాంతాల్లో ఈ డ్రాప్స్‌ వేస్తారు.

Pulse Polio : నేటి నుంచి పల్స్ పోలియో వ్యాక్సిన్ డ్రైవ్!
New Update

Pulse Polio Vaccine Drive in India : పోలియో వైరస్(Polio Virus) అంటే ప్రజలు గజగజలాడిపోయేవి. దీని సంక్రమణ వలన కలిగే పోలియో వ్యాధి ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఆరోగ్య సంక్షోభానికి దారి తీసిన రోజులు ఉండేవి. అయితే టీకా(Tika) లు వేయడంతో పాటు ఈ వ్యాధిపై అవగాహన కల్పించడంతో చాలా దేశాలు సక్సెస్ అయ్యాయి. ఆ సంబంధిత దేశాలన్ని సంక్రమణను ఆపడంలో విజయం సాధించాయి. పోలియో రహిత దేశాలలో భారత్‌(India) కూడా ఉంది. జనవరి13, 2011న పశ్చిమ బెంగాల్‌లో చివరి సారిగా సంక్రమణ కేసు నమోదైంది. ఈ వ్యాధి కట్టడికి రోగనిరోధక శక్తిని పెంచడానికి, భారత ప్రభుత్వం 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఉచిత ఓరల్ పోలియో వ్యాక్సిన్‌ను అందిస్తుంది. ఇవాళ్టి నుంచి పల్స్‌ పోలియో వ్యాక్సిన్‌ డ్రైవ్‌ మొదలుకానుంది.

తెలంగాణలో పల్స్‌ పోలియో:
తెలంగాణ(Telangana) వ్యాప్తంగా ఆదివారం పల్స్ పోలియో(Pulse Polio) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పుట్టిన బిడ్డ నుంచి ఐదేళ్ల వరకు పిల్లలందరికీ టీకాలు వేయించాల్సి ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. ఆదివారం ఎవరైనా వ్యాక్సిన్ వేయించుకోలేకపోతే సోమ, మంగళవారాల్లో అంగన్‌వాడీ కేంద్రాలు, సబ్ సెంటర్లు, సమీపంలోని ఆసుపత్రులకు వెళ్లి వేయించుకోవాలని సూచించారు. 70 వేల మంది ఆరోగ్య కార్యకర్తలు, సిబ్బంది, వైద్యులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

ఏపీలో పల్స్‌ పోలియో:
ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) లో మార్చి 3 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ డ్రైవ్‌(Pulse Polio Immunization Drive) జరగనుంది. రాష్ట్రంలో ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 53,35,519 మంది పిల్లలకు టీకాలు వేయడానికి రాష్ట్ర ఆరోగ్య శాఖ సిద్ధమైంది. వ్యాక్సిన్‌ డ్రైవ్ మార్చి 6 వరకు కొనసాగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 37,465 బూత్‌లు, 1,087 ట్రాన్సిట్ బూత్‌లను ఏర్పాటు చేశారు. కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు అన్ని జిల్లాలకు నోడల్ అధికారులను నియమించారు. 1,693 మొబైల్ టీమ్‌లతో పాటు డోర్ టు డోర్ విజిట్‌(Door To Door Visit) ల కోసం 74,930 బృందాలను ఏర్పాటు చేశారు. కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించేందుకు 1,55,420 మంది వాలంటీర్లు, 4,116 మంది సూపర్‌వైజర్లను నియమించారు. అన్ని జిల్లాలకు 67,76,100 డోస్‌ల వ్యాక్సిన్‌, ఇతర అవసరమైన సామాగ్రిని పంపిణీ చేశారు.

Also Read : కంటి నొప్పి వేధిస్తోందా? ఈ సున్నితమైన అవయవాన్ని ఎలా చూసుకోవాలి?

#health-news #vaccine #pulse-polio
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe