Polimera 3 : 'పొలిమేర 3' లోడింగ్... అనౌన్స్ మెంట్ వీడియోతోనే అంచనాలు పెంచేసిన మేకర్స్!

'పొలిమేర 3' పై మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. ఇందులో భాగంగానే అనౌన్స్ మెంట్ వీడియో రిలీజ్ చేశారు. పార్ట్-2 ను పంపిణీ చేసిన వంశీ నందిపాటి భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సత్యం రాజేష్‌తో పాటూ మరో కమెడియన్‌ కూడా ఇందులో నటిస్తున్నారు.

New Update
Polimera 3 : 'పొలిమేర 3' లోడింగ్... అనౌన్స్ మెంట్ వీడియోతోనే అంచనాలు పెంచేసిన మేకర్స్!

Polimera 3 Announcement : రెండేళ్ల క్రితం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (Disney+ Hotstar) ఓటీటీ`లో విడుదలైన 'మా ఊరి పొలిమేర' సినిమా ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ పొందడమే.. కాకుండా మంచి   విజయం సాధించింది. డా.అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో కమెడియన్ సత్యం రాజేష్ (Satyam Rajesh) లీడ్ రోల్ లో నటించిన ఈ సినిమా పార్ట్ 1 ఊహించని విజయం సాధించడమే కాకుండా.. ప్రేక్షకుల్లో సీక్వెల్ పై ఆసక్తిని పెంచింది. ఈ క్రమంలోనే గత ఏడాది పొలిమేర -2 థియేటర్లలో విడుదలై ప్రేక్షకులలో మంచి రెస్పాన్స్ అందుకుంది.

సినిమా క్లైమాక్స్ లో పార్ట్-3 కూడా ఉందని కన్ఫర్మ్ చేశారు. దీంతో ఆడియన్స్ అంటా పార్ట్-3 కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న తరుణంలో మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. తాజాగా 'పొలిమేర 3' కూడా రాబోతుందని తాజాగా ఈ చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఇందులో భాగంగానే రిలీజ్ చేసిన అనౌన్స్ మెంట్ వీడియో ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది.

Also Read : రా అండ్ రస్టిక్ గా ‘తంగలాన్’ ట్రైలర్.. విక్రమ్ నట విశ్వరూపం!

పోలిమేర-2 చిత్రాన్ని పంపిణీ చేసిన వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నానని ప్రకటన విడుదల చేశారు. పోలిమేర ముందు భాగాల కంటే అత్యంత భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మించాలని అనుకుంటున్నారట. అంతేకాదు సత్యం రాజేష్‌తో మరో ప్రముఖ కమెడియన్‌ కూడా ఈ చిత్రంలో ప్రముఖ పాత్ర పోషించే అవకాశాలున్నాయని చిత్ర బృందం తెలిపింది. త్వరలోనే మరిన్ని వివరాలను తెలియజేయనున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు