Varalakshmi Tiffins: టిఫిన్స్‌ ఆర్డర్‌ చేస్తే స్వీగ్గీ, జొమాటోలో మాదక ద్రవ్యాలు!

ఆమె చెడు వ్యసనాలకు, మాదక ద్రవ్యాలకు బానిసైంది. దానికి తగినట్లు చెడు అలవాట్లు కూడా సోకాయి. ఈ క్రమంలోనే ఆమె తరచూ గోవా కి వెళ్తూండేది. అక్కడే ఆమెకు నైజీరియాకు చెందిన ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది.

New Update
Varalakshmi Tiffins: టిఫిన్స్‌ ఆర్డర్‌ చేస్తే స్వీగ్గీ, జొమాటోలో మాదక ద్రవ్యాలు!

వరలక్ష్మీ టిఫిన్‌(Varalakshmi Tiffins) సెంటర్ గత కొద్ది రోజులుగా బాగా పాపులర్‌ అయిన నేమ్‌. టిఫిన్‌ సెంటర్ పేరుతో మాదక ద్రవ్యాలను వినియోగిస్తున్న ముఠాను పోలీసులు(Police) ఇటీవల అరెస్ట్‌ చేశారు. పక్కా ఇన్ఫర్మేషన్‌ రావడంతో మోకిల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సోదాలు నిర్వహించి..సుమారు 14 లక్షల విలువైన మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసులో ప్రధానంగా మాదక ద్రవ్యాలను సప్లయ్ చేస్తున్న అనురాధ(Anuradha) అనే మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఆమె తో పాటు వరలక్ష్మి టిఫిన్‌ సెంటర్‌ యజమాని ప్రభాకర్‌ రెడ్డి, పల్లెటూరు పుల్లట్లు శివసాయి కుమార్‌ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ క్రమంలో పోలీసులు అనురాధా గురించి విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అనురాధ ది కరీంనగర్ జిల్లా గన్నేరు గూడ. ఆమె ఎంబీఏ చేసి హైదరాబాద్ లో ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేసింది. ఆమెకు అక్కడ మంచి జీతమే వచ్చేది. ఇది కాకుండా సొంతూరు నుంచి కూడా ఆమెకు నగదు అందేది. తండ్రి ఓ ప్రభుత్వోద్యోగి.

ఆమెకు వివాహం కూడా అయ్యింది. అయితే కొన్ని విభేదాల కారణంగా భర్తతో విడాకులు తీసుకుంది. ఈ క్రమంలోనే ఆమె చెడు వ్యసనాలకు, మాదక ద్రవ్యాలకు బానిసైంది. దానికి తగినట్లు చెడు అలవాట్లు కూడా సోకాయి. ఈ క్రమంలోనే ఆమె తరచూ గోవా కి వెళ్తూండేది. అక్కడే ఆమెకు నైజీరియాకు చెందిన ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది.

అతని వద్ద నుంచి మాదక ద్రవ్యాలను కొనుగోలు చేసి నగరానికి తీసుకుని వచ్చి వాటిని ఇక్కడ విక్రయించేది. ఇలా సాగుతున్న ఆమె వ్యాపారంలోకి వరలక్ష్మి టిఫిన్స్‌ ప్రభాకర్‌ రెడ్డి పరిచయం ఏర్పడింది. అతను కూడా మాదక ద్రవ్యాలకు బానిసే..దీంతో అనురాధ వద్ద నుంచి పెద్ద మొత్తంలో ఆమె వద్ద నుంచి మాదక ద్రవ్యాలను కొనుగోలు చేసేవాడు. ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారి తీసింది.

ఈ క్రమంలో వీరిద్దరికి పల్లెటూరు పుల్లట్లు శివకుమార్‌ తో పరిచయం ఏర్పడి అతనిని కూడా ఈ ఉచ్చులోకి దింపారు. దీంతో రెండు హోటళ్ల నుంచి మాదక ద్రవ్యాలను బాగా అమ్మేవారు. మాదక ద్రవ్యాలను కస్టమర్ లకు ఆన్లైన్ లో టిఫిన్స్ ఆర్డర్ చేసి స్విగ్గి, జొమాటో లో పంపినట్లు పోలీసులు భావిస్తున్నారు. అనురాధ కు సెలబ్రిటీ లతో పరిచయాలు ఉన్నట్లు అనుమానం??. ఈ క్రమంలోనే అనురాధ వాట్సాప్‌‌‌‌, స్నాప్‌‌‌‌చాట్స్‌‌‌‌ ఆధారంగా కస్టమర్ల డేటాపోలీసులు కలెక్ట్ చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు