ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామపంచాయతీ పరిధిలోని చంద్రాయపాలెం అటవీ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. పోడు భూముల విషయంలో రెండు గిరిజ వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ విషయంలో పోలీసులకు గిరిజనులకు మధ్య గొడవ జరిగింది. ముందు వాగ్వాదంగా మొదలైన గొడవ తర్వాత దాడి చేసే వరకు వెళ్లింది. పోలీసులపై గిరిజనులు తీవ్రంగా దాడి చేశారు. గిరిజనుల దాడిలో సత్తుపల్లి సీఐ కిరణ్‌తో సహా మరో నలుగురు పోలీస్ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు.
This browser does not support the video element.
కొంతకాలంగా చంద్రాయపాలెం అటవీ ప్రాంతంలోని పోడు భూముల విషయంలో గొడవలు జరుగుతున్నాయి.ఈ క్రమంలో న బుగ్గపాడు,చంద్రాయపాలెం గ్రామానికి చెందిన గిరిజనులు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న సత్తుపల్లి పోలీసులు అటవీ ప్రాంతానికి వెళ్లారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులపై గిరిజనులు దాడికి పాల్పడ్డారు.సీఐ కిరణ్ పై గిరిజనులు కర్రలతో అటాక్ చేశారు. సీఐను కాపాడేందుకు ప్రయత్నించిన మరో నలుగురు సిబ్బందిని కూడా గిరిజనులు తీవ్రంగా కొట్టారు. ఇక ఆ తర్వాత గిరిజనుల దాడి నుంచి అతి కష్టంపై సీఐ తప్పించుకుని బయటపడ్డారు.
Also Read : షహీన్ ఆఫ్రిదికి షాక్.. బాబర్ ఇజ్ బ్యాక్.. పాక్ షాకింగ్ నిర్ణయం!
Also Read : కాంగ్రెస్‌లోకి కడియం కుటుంబం!