Tribals vs Police Fight : సత్తుపల్లిలో పోలీసులపై గిరిజనులు దాడి..సీఐ కిరణ్‌ను కర్రలతో ఎలా కొట్టారో చూడండి! పోలీసులపై గిరిజనులు దాడి చేశారు. సత్తుపల్లి మండలం చంద్రాయపాలెం అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. రెండు వర్గాల మధ్య నెలకొన్న పోడు భూముల వివాదాన్ని పరిష్కరించేందుకు వెళ్లిన పోలీసులను గిరిజనులు తీవ్రంగా కొట్టారు. By Trinath 31 Mar 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామపంచాయతీ పరిధిలోని చంద్రాయపాలెం అటవీ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. పోడు భూముల విషయంలో రెండు గిరిజ వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ విషయంలో పోలీసులకు గిరిజనులకు మధ్య గొడవ జరిగింది. ముందు వాగ్వాదంగా మొదలైన గొడవ తర్వాత దాడి చేసే వరకు వెళ్లింది. పోలీసులపై గిరిజనులు తీవ్రంగా దాడి చేశారు. గిరిజనుల దాడిలో సత్తుపల్లి సీఐ కిరణ్‌తో సహా మరో నలుగురు పోలీస్ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. Your browser does not support the video tag. కొంతకాలంగా చంద్రాయపాలెం అటవీ ప్రాంతంలోని పోడు భూముల విషయంలో గొడవలు జరుగుతున్నాయి.ఈ క్రమంలో న బుగ్గపాడు,చంద్రాయపాలెం గ్రామానికి చెందిన గిరిజనులు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న సత్తుపల్లి పోలీసులు అటవీ ప్రాంతానికి వెళ్లారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులపై గిరిజనులు దాడికి పాల్పడ్డారు.సీఐ కిరణ్ పై గిరిజనులు కర్రలతో అటాక్ చేశారు. సీఐను కాపాడేందుకు ప్రయత్నించిన మరో నలుగురు సిబ్బందిని కూడా గిరిజనులు తీవ్రంగా కొట్టారు. ఇక ఆ తర్వాత గిరిజనుల దాడి నుంచి అతి కష్టంపై సీఐ తప్పించుకుని బయటపడ్డారు. Also Read : షహీన్ ఆఫ్రిదికి షాక్.. బాబర్ ఇజ్ బ్యాక్.. పాక్ షాకింగ్ నిర్ణయం! Also Read : కాంగ్రెస్‌లోకి కడియం కుటుంబం! #police #khammam #tribals మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి