BRS EX MLA Shakeel Son Case: పంజాగుట్ట రోడ్డు ప్రమాదం కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ బెయిల్ రద్దు చేయాలని హైకోర్టును పోలీసులు ఆశ్రయించారు. తాజాగా రాహిల్‌కు బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. 2022లో జరిగిన రోడ్డు ప్రమాదం కేసును రీ ఓపెన్ చేశారు పోలీసులు. 2022 మార్చిలో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో జరిగిన కారు ప్రమాదంలో నెలల చిన్నారి మృతి చెందగా.. ఇద్దరికీ గాయాలు అయ్యాయి. ఈ కేసు దర్యాప్తు చేసిన అప్పటి పోలీస్ అధికారుల వాంగ్మూలాన్ని నమోదు చేశారు పోలీసులు.
ALSO READ: మేఘా కృష్ణారెడ్డికి షాక్.. సీబీఐ కేసు నమోదు
అసలు ఏమైందంటే..
ప్రజాభవన్ వద్ద గత ఏడాది డిసెంబర్ 24న (ఆదివారం) రాత్రి అతివేగంగా వచ్చిన ఓ బీఎండబ్ల్యూ కారు(BMW Car) భారీకేడ్లను ఢీ కొట్టింది. ఆ సమయంలో కారులో ఇద్దరు యువకులతో పాటు ఇద్దరు యువతులు ఉన్నట్లు తెలిసింది. ఆ కారు బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ దని చెబుతున్నారు పోలీసులు. వీళ్లంతా స్టూడెంట్స్ అని.. కారు డ్రైవ్ చేసింది బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్ అని కన్ఫామ్ చేశారు పోలీస్ అధికారులు.
యాక్సిడెంట్ జరిగిన తర్వాత షకీల్ ఇంట్లో డ్రైవర్‌గా పని వేసే వ్యక్తి.. తానే డ్రైవ్ చేసినట్లుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చాడని వెల్లడించారు. షకీల్ డ్రైవర్ పోలీసుల్ని తప్పుదోవ పట్టించే యత్నం చేశాడని.. కానీ సీసీ ఫుటేజీ ద్వారా రాహిల్ కారు నడిపినట్లు గుర్తించినట్లు చెప్పారు. మద్యం మత్తులో బారికేడ్లను ఢీకొట్టారని చెబుతున్నారు. రాహిల్ పై గతంలోనూ జూబ్లీహిల్స్‌లో ఓ యాక్సిడెంట్ కేసు నమోదు అయింది.