Telangana:ఎన్నికల కోడ్ తో మొదలైన తనిఖీలు.. భారీ బంగారం పట్టివేత! లోక్ సభ ఎన్నికల వేళ తనిఖీలు చేపట్టిన పోలీసులకు నల్గొండ జిల్లాలో భారీ బంగారం పట్టుబడింది. హైదరాబాద్ నుంచి కోదాడ వెళ్తున్న బొలెరో వాహనంలో మిర్యాలగూడ వద్ద రూ. 6 కోట్ల విలువైన 13 కిలోల బంగారం దొరికింది. ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. By srinivas 18 Mar 2024 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి Nalgonda: లోక్ సభ ఎన్నికల వేళ పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు మొదలుపెట్టారు. భారీ స్థాయిలో నగదు చేతులు మారుతుందనే సమాచారంతో ఆయా ప్రాంతాల్లో చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేశారు. అనుమానం వచ్చిన ప్రతి వ్యక్తిని, వాహనాన్ని తనిఖీ చేసిన తర్వాతే పంపిస్తున్నారు. అయితే ఒకవైపు పటిష్ట భద్రత ఉన్నప్పటికీ మరోవైపు బ్లాక్ మని, బంగారం, తదితర విలువైన సొమ్ములు అక్రమ మార్గాల్లో తరలిస్తూనే ఉన్నారు. 13 కిలోల బంగారం.. ఇందులో భాగంగానే సోమవారం సాయంత్రం నల్గొండ జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేసిన పోలీసులకు భారీ బంగారం పట్టుబడింది. హైదరాబాద్ నుంచి కోదాడ వెళ్తున్న ఓ బొలెరో వాహనంలో మిర్యాలగూడ వద్ద రూ. 6 కోట్ల విలువైన 13 కిలోల బంగారం దొరికింది. ఇది కూడా చదవండి: TS: తెలంగాణకు కొత్త గవర్నర్.. ఆయనకే బాధ్యతలు! పకడ్బందీ పహారా.. దీంతో వెంటనే ఆ బంగరం, వాహనాన్ని స్వాధీనం చేసుకుని అందులో ప్రయాణిస్తున్న ముగ్గురిని పోలీసులు విచారిస్తున్నట్లు తెలిపారు. అలాగే రాష్ట్ర సరిహద్దులతో పాటు వివిధ చెక్‌పోస్టుల వద్ద విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఓటర్లను డబ్బుతో ఏ విధమైన ప్రలోభాలకు గురి చేయకుండా పకడ్బందీగా పహారా కాస్తున్నామన్నారు. #nalgonda #police-seized-gold మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి