Traffic rules: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. సదర్ నేపథ్యంలో ఈ రోజు ఆ ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..

హైదరాబాద్‌లో సదర్‌ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ క్రమంలో నగరంలోని కొన్ని ప్రాంతాలకు ట్రాఫిక్‌ అధికారులు ఆంక్షలు విధించారు. సికింద్రాబాద్‌ నుంచి కోఠి వైపు వచ్చే పలు బస్సులను ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌ మీదుగా మళ్లించనున్నారు.

New Update
Traffic rules: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. సదర్ నేపథ్యంలో ఈ రోజు ఆ ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..

హైదరాబాద్‌(Hyderabad) లో బతుకమ్మ, బోనాల పండుగ తరువాత అంతటి విశిష్టత కలిగినది సదర్‌ పండుగ(Sadar utsav). దీపావళి తరువాత ఎంతో ఉత్సాహంగా జరుపుకునే ఈ వేడుకను చూసేందుకు రాష్ట్రానికి భారీ సంఖ్యలో ప్రజలు తరలివస్తుంటారు. ప్రస్తుతం సదర్‌ ఉత్సవాలకు హైదరాబాద్‌ ముస్తాబయ్యింది.

దీంతో నగరంలో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. నారాయణగూడ వైఎంసీఏ మార్గంలో ప్రయాణించే వాహనాలను మరో దారిలో మళ్లీంచేందుకు ఏర్పాట్లు చేశారు. దీని గురించి నగర ట్రాఫిక్‌ చీఫ్‌ సుధీర్‌ బాబు సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేశారు. మంగళవారం రాత్రి 7 గంటల నుంచి బుధవారం తెల్లవారు జామున 3 గంటల వరకు ఈ ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉన్నాయని వెల్లడించారు.

ట్రాఫిక్‌ మళ్లించిన ప్రాంతాల వివరాలు ఇవే...

బర్కత్‌పురా చమాన్‌ నుంచి వైఎంసీఏ వైపు వచ్చే వాహనాలకు అనుమతి లేదు. వాటిని బర్కత్‌ పురా క్రాస్‌ రోడ్స్‌, టూరిస్ట్‌ హోటల్‌ నుంచి మళ్లించనున్నారు. కాచిగూడ క్రాస్‌ రోడ్స్‌ నుంచి వైఎంసీఏ మార్గంలో వచ్చే వాహనాలను టూరిస్ట్‌ హోటల్‌ రోడ్‌ వైపు మళ్లింపు. సదర్‌ మేళాకు వచ్చే వాహనాలను శాంతి థియేటర్, రెడ్డి కాలేజ్‌ , మెల్కొటే పార్క్‌, దీపక్‌ థియేటర్‌ పార్కింగ్‌ ఏరియాల్లో పార్క్‌ చేయాల్సి ఉంటుంది.

స్ట్రీట్ నంబర్ 8 నుంచి వైఎంసీఏ వైపు ప్రవేశం లేదు. రెడ్డి కాలేజీ వద్ద బర్కత్‌ పురా వైపు నుంచి మళ్లీస్తారు. ఓల్డ్‌‌ ఎక్సైజ్ ఆఫీస్‌‌ నుంచి వచ్చే వాహనాలను విఠల్‌‌వాడి మీదుగా మళ్లిస్తారు. బ్రిలియంట్ గ్రామర్ స్కూల్‌‌ నుంచి రెడ్డి కాలేజి వైపు వచ్చే వాహనాలకు ఎంట్రీ లేదు. నారాయణగూడ క్రాస్ రోడ్స్‌‌ మీదుగా మళ్లించనున్నారు.

సికింద్రాబాద్‌ నుంచి కోఠి వైపు వచ్చే ఆర్టీసీ బస్సులను నారాయణగూడ క్రాస్‌ రోడ్స్‌, బర్కత్‌పురా, బాగ్‌ లింగంపల్లి, వీఎస్‌టీ, ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌ మీదుగా మళ్లించనున్నారు. ఓల్డ్‌‌ బర్కత్‌‌పురా పోస్టాఫీస్ నుంచి వైఎంసీఏ వైపు వచ్చే వాహనాలకు ప్రవేశం లేదు. ట్రాఫిక్‌‌ను క్రౌన్ కేఫ్‌‌, బాగ్‌‌ లింగంపల్లి వైపు మళ్లింపు. విఠల్‌‌వాడి క్రాస్‌‌ రోడ్స్ నుంచి వచ్చే వాహన ట్రాఫిక్‌‌ను భవన్స్‌‌ న్యూ సైన్స్‌‌ కాలేజ్‌‌, కింగ్‌‌కోటి మీదుగా మళ్లీంపు.

వీటిని గమనించి ఆ ప్రాంతాల వారు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Also read: గ్రీన్ బీన్స్ చేసే మేలు తెలుసుకుంటే తినకుండా ఉండలేరు!

Advertisment
తాజా కథనాలు